Share News

Great Man Marulayya: చరిత్ర మర్చిపోయిన వీరుడు.. 6 వేల శవాలకు అంత్యక్రియలు చేశాడు..

ABN , Publish Date - May 19 , 2025 | 04:01 PM

Great Man Marulayya: భాద్రపద శుక్ల పంచమి, వికార సంవత్సర అని అందులో రాసి ఉంది. అంటే ఆగస్టు 18, 1539 అని అర్థం. ఆ సమయంలో అచ్యుత దేవరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్నాడు.

Great Man Marulayya: చరిత్ర మర్చిపోయిన వీరుడు.. 6 వేల శవాలకు అంత్యక్రియలు చేశాడు..
Great Man Marulayya

అది 1539. విజయనగర సామ్రాజ్యాన్ని అచ్యుత దేవరాయలు పరిపాలిస్తున్నాడు. ఆ సంవత్సరం విజయనగర సామ్రాజ్యంలో దారుణమైన కరువు వచ్చింది. తిండి, నీళ్లు లేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్యంలో ఎక్కడ పడితే అక్కడ శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోతున్నాయి. చక్రవర్తి సైతం దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. అలాంటి సమయంలో మరులయ్య అనే వ్యక్తి ఎవ్వరూ చేయని గొప్ప పని చేశాడు. చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. కరువు కారణంగా చనిపోయిన దిక్కులేని శవాలకు సంస్కారాలు చేయటం మొదలెట్టాడు.


వందో.. రెండొందలో కాదు.. ఏకంగా 6 వేలకు పైగా శవాలకు అంత్యక్రియలు నిర్వహించాడు. తలపై ఉన్న బుట్టలో, భుజంపై శవాలను వేసుకుని మరీ అంత్యక్రియల కోసం తీసుకెళ్లాడు. మరులయ్య చేసిన గొప్ప పని చరిత్రలో నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన శిలా శాసనం.. హవేరి జిల్లా గుట్టల్ గ్రామంలోని చంద్రశేఖర స్వామి దేవస్థానంలో ఇప్పటికీ ఉంది. ఆ శిలా శాసనంలో మరులయ్య తన తలపై ఉన్న వెదురు బుట్టలో రెండు శవాలను వేసుకుని పూడ్చడానికి తీసుకెళుతున్నాడు.


మరులయ్య కుడి వైపు, ఎడమ వైపు అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ఎడమ వైపు ఓ శివలింగం కూడా ఉంది. భాద్రపద శుక్ల పంచమి, వికారి సంవత్సర అని అందులో రాసి ఉంది. అంటే ఆగస్టు 18, 1539 అని అర్థం. ఆ సమయంలో అచ్యుత దేవరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్నాడు. మరులయ్య గురించి కర్ణాటక రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ షేజేశ్వర్ మాట్లాడుతూ.. ‘ ఓ మనిషి 6 వేల మందికి అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. ఆయన గుర్తింపు కోసం ఇలా చేయలేదు. పుణ్యం, మంచి కోసం చేశాడు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Pakistani Spies: యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు.. 11 మంది దేశ ద్రోహులు..

Apara Ekadashi: అపర ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేస్తే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం..

Updated Date - May 19 , 2025 | 04:40 PM