ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంచ్‌ విసిరితే అంతే...

ABN, Publish Date - Jun 08 , 2025 | 11:53 AM

కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు బాక్సింగ్‌ రింగ్‌లో అప్పర్‌కట్‌లు, లెగ్‌ కిక్‌లతో హోరాహోరీగా తలపడుతున్నారు.

కిక్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు బాక్సింగ్‌ రింగ్‌లో అప్పర్‌కట్‌లు, లెగ్‌ కిక్‌లతో హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రేక్షకులు అరుస్తూ ఈలలు వేస్తూ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నారు. చివరకు ఒకరిని రెఫరీ విజేతగా ప్రకటించడంతో ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం దద్దరిల్లింది. అయితే ఇక్కడ ఆ వీరులు ఎవరో తెలుసా? హ్యూమనాయిడ్‌ రోబోలు. అవును... ఈ వింత బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఇటీవలే చైనాలో జరిగాయి.

2011లో వచ్చిన సైన్స్‌ఫిక్షన్‌ మూవీ ‘రియల్‌ స్టీల్‌’ చూశారా? అందులో హీరో జాక్‌మాన్‌ రోబో ఫైటింగ్‌ కోచ్‌గా నటించారు. ఈ చిత్రంలో రోబో బాక్సింగ్‌ ఫైట్‌ ప్రేక్షకులను అలరించింది. అది సినిమా. నిజజీవితంలో రోబో ఫైట్‌ చూస్తామని సినిమా చూసిన ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. కానీ ఒక దశాబ్దం తరువాత అదే నిజమయ్యింది. చైనాకు చెందిన ‘యునిట్రీ’ రోబోటిక్స్‌ కంపెనీ రోబో ఫైటింగ్‌ కాంపిటీషన్‌ నిర్వహించింది. భవిష్యత్తులో మనుషులు ఆడే ఆటలు చూడటం తగ్గిపోయి రోబోల మధ్య జరిగే పోటీలు చూసేందుకు జనం ఎగబడతారనడానికి ఇదో ఉదాహరణ. చైనాకు చెందిన రోబోటిక్స్‌ కంపెనీ ‘యునిట్రీ’ ఈ పోటీలను నిర్వహించింది. కంపెనీ రూపొందించిన జీ1 రోబో మోడల్స్‌ శక్తిసామర్థ్యాలను గుర్తించేందుకు రోబో ఫైటింగ్‌ కాంపిటీషన్‌ పెట్టారు. ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి ‘హ్యూమనాయిడ్‌ రోబో ఫైటింగ్‌ కాంపిటీషన్‌’ ఇదే.


క్రీడాభిమానులకు సరికొత్త వినోదం...

బాక్సింగ్‌ పోటీలో 4 అడుగుల 3 అంగుళాల పొడవు, 35 కిలోల బరువున్న జీ1 రోబోలు అద్భుతమైన ఆటతీరును కనబరిచాయి. హుక్స్‌, అప్పర్‌కట్‌లు, లెగ్‌కిక్‌లు, సైడ్‌ కిక్‌, ఏరియన్‌ స్పిన్‌ కిక్‌లతో క్రీడాభిమానులను ఆకట్టుకున్నాయి. చైనా మీడియా గ్రూప్‌ ఈ పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఫైనల్‌లో రెండు జీ1 రోబోలు తలపడ్డాయి. ఇందులో చైనీస్‌ టెక్‌ ఇన్‌ప్లూయెన్సర్‌ లూక్సిన్‌ నియంత్రించిన యునిట్రీ రోబోటిక్స్‌ రోబో విజేతగా నిలిచింది. ఒక రోబో కిందపడిపోయిన తరువాత 8 సెకన్ల పాటు లేవలేక పోయినప్పుడు ఓడిపోయినట్టుగా ప్రకటించారు.


రోబోల కదలికలను వాయిస్‌ కమాండ్స్‌, రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా నియంత్రించారు. ఇప్పటి వరకు రోబోలు వైద్యరంగంలో సహాయం చేయడం, మారథాన్‌, ఆతిథ్య రంగంలో సేవలు అందించడం వంటి వాటిలో ప్రతిభను కనబరిచాయి. తాజాగా బాక్సింగ్‌ రింగ్‌లో తలపడి ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకున్నాయి. ఆటలలో కృత్రిమ మేధస్సు(ఏఐ) వినియోగం పెరుగుతోంది అనడానికి ఈ ఆటలు నిదర్శనం. ‘చైనా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌’ అంచనా ప్రకారం 2030 కల్లా చైనా హ్యూమనాయిడ్‌ రోబో మార్కెట్‌ పది లక్షల కోట్లకు చేరుకుంటుందట.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 08 , 2025 | 11:53 AM