ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shocking: వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..

ABN, Publish Date - Jun 26 , 2025 | 02:55 PM

ప్రస్తుతం యువతీయువకులు సాయంత్రమైతే చాలు ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్‌ఫుడ్ నూడిల్స్. బయట ఫుడ్‌స్టాల్స్‌లో నూడిల్స్ తినే వారు మాత్రమే కాదు.. నూడిల్స్ ప్యాకెట్లు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లి తయారు చేసుకుని తినేవారు కూడా ఎంతో మంది ఉన్నారు.

Ramen noodles cancer warning

ప్రస్తుతం యువతీయువకులు సాయంత్రమైతే చాలు ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్‌ఫుడ్ నూడిల్స్ (Noodles). బయట ఫుడ్‌స్టాల్స్‌లో నూడిల్స్ తినే వారు మాత్రమే కాదు.. నూడిల్స్ ప్యాకెట్లు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లి తయారు చేసుకుని తినేవారు కూడా ఎంతో మంది ఉన్నారు. చాలా త్వరగా రెడీ అయిపోయే నూడిల్స్ తినడాన్ని అందరూ ఇష్టపడతారు. అయితే ఆ నూడిల్స్ తినడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే. మ్యాగీ, ఇప్పీ నూడిల్స్ లాగానే రమెన్ నూడిల్స్ (Ramen noodles) కూడా కొన్ని చోట్ల బాగా పాపులర్.

తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే. రమెన్ నూడిల్స్ ప్యాకెట్ మీద రాసి ఉన్న వార్నింగ్‌ను ఆ వీడియోలో చూపించారు. ఆ ప్యాకెట్ మీద కేన్సర్, పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది అంటూ వార్నింగ్‌‌ను (cancer warning) ప్రింట్ చేశారు. ఆ వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సిగరెట్లు, ఆల్కహాల్ ప్యాకింగ్‌ల మీద రాసినట్టు నూడిల్స్ ప్యాకెట్ మీద కూడా అలా రాయడాన్ని బట్టి చూస్తే అవి ఆరోగ్యానికి ఎంత హానికరమో అర్థమవుతోందని కామెంట్లు చేశారు.

ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. దాదాపు 8 లక్షల మంది ఆ వీడియోను వీక్షించారు. 60 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది నిజంగా షాకింగ్.. ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత ప్రమాదకరమో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని ఒకరు కామెంట్ చేశారు. నూడిల్స్ ఎక్కువగా తింటే ప్రమాదమేనని, సంవత్సరానికి 5,6 సార్లు మాత్రమే తింటే ఫర్వాలేదని మరొకరు కామెంట్ చేశారు. జపాన్, కొరియాల్లో నూడిల్స్‌ను ఎక్కువగా తింటారని, అందుకే అక్కడ బర్త్ రేట్ తక్కువగా ఉందని మరొకరు గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి..

మీ కళ్లకు పవర్‌ ఉంటే.. జిరాఫీల మధ్యనున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి


మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో Mల మధ్యనున్న Nను 5 సెకెన్లలో కనిపెట్టండి


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2025 | 02:55 PM