ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mukul Dev: టాలీవుడ్ విలన్ మృతి.. ఈయన ఎవరి తమ్ముడో తెలుసా..

ABN, Publish Date - May 24 , 2025 | 09:03 PM

Mukul Dev: ముకుల్ దేవ్ 1996లో వచ్చిన దస్తక్ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2008లో వచ్చిన రవితేజ ‘కృష్ణ’ సినిమాతో తెలుగులోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు.

Mukul Dev

ప్రముఖ టాలీవుడ్ విలన్ ముకుల్ దేవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 54 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో ముకుల్ అన్న.. ప్రముఖ విలన్ రాహుల్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ చాలా ఎమోషనల్ అయిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆయన పక్కన ఉన్న వాళ్లు ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినా ఆగలేదు.


కన్నీళ్లతోటే తమ్ముడికి తుది వీడ్కోలు పలికారు. అంతకు క్రితం రాహుల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘ మా తమ్ముడు ముకుల్ దేవ్ గత రాత్రి ఢిల్లీలో ప్రశాంతంగా కన్నుమూశారు. అతడికి ఓ కూతురు సియా దేవ్ ఉంది. సోదరీ, సోదరులు రష్మీ కౌశల్, రాహుల్ దేవ్ అతడ్ని ఎంతో మిస్ అవుతున్నాం. 5 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. మీరు కూడా అంత్యక్రియల్లో పాల్గొనండి’ అంటూ ఎమోషనల్ అయ్యారు. రాహుల్ అంత్యక్రియల్లో పాల్గొన్న తాలూకా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ వీడియోలో రాహుల్ బంధు మిత్రులను హగ్ చేసుకుంటూ ముందుకు సాగారు.


కాగా, ముకుల్ దేవ్ 1996లో వచ్చిన దస్తక్ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2008లో వచ్చిన రవితేజ ‘కృష్ణ’ సినిమాతో తెలుగులోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో వరుస సినిమాలు చేశారు. ఏక్ నిరంజన్, సిద్ధం,కేడి, అదుర్స్, బెజవాడ, నిప్పు, భాయ్ సినిమాల్లో నటించారు. భాయ్ సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. 2022లో ఆయన నటించిన అంత్ ది ఎండ్ సినిమా విడుదల అయింది. ఈ సినిమా తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.


ఇవి కూడా చదవండి

Viral Video: బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. కండెక్టర్ లేకపోయి ఉంటే..

Daughter Marriage: కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..

Updated Date - May 24 , 2025 | 09:03 PM