ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anaconda Video: అనకొండలతో నిండిపోయిన ఆ నదిని చూశారా.. అసలు సంగతేంటంటే

ABN, Publish Date - May 26 , 2025 | 07:36 PM

ఒక్క అనకొండను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అయితే డజన్ల కొద్దీ అనకొండలతో నిండిన నదిని చూస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. హెలికాఫ్టర్‌లో వెళ్తూ నదిలో దృశ్యాన్ని షూట్ చేసినట్టు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది.

Dozens of anacondas in the river

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటే (Snakes) భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటు వైపు కూడా వెళ్లరు. ఇక, కొండచిలువలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక, పాములలో అతి పెద్దవైన అనకొండ పేరు వింటే చాలు గుండెలు అదిరిపోతాయి. ఈ భూమి మీదే అతిపెద్ద అనకొండ (Anaconda)ను కొన్ని రోజుల క్రితం ఈక్వెడార్‌లో కనుగొన్నారు. తాజాగా అమెజాన్ అడవుల్లో (Amazon forest) మరో భారీ అనకొండ కనిపించింది.


ఒక్క అనకొండను చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటిది డజన్ల కొద్దీ అనకొండలతో నిండిన నదిని చూస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. హెలికాఫ్టర్‌లో వెళ్తూ నదిలో దృశ్యాన్ని షూట్ చేసినట్టు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అమెజాన్ అడవుల్లో ప్రవహించే ఓ నదిలో డజన్ల కొద్దీ అనకొండలు ఈత కొడుతున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియో చూసిన వారందరూ షాకవుతున్నారు. అది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే అది నిజమైన వీడియో కాదు.


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆ వీడియోను రూపొందించారు. ఏఐతో రూపొందించిన ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు. 27 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది నిజం కాదు.. ఏఐ వీడియో అయినా చాలా రియలిస్టిక్‌గా ఉందని ఒకరు కామెంట్ చేశారు. ఈ నదిలో పడితే ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యం అని మరొకరు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

పాక్ విమానానికి ఇసుక తుఫాన్ దెబ్బ.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..

మీవి డేగ కళ్లు అయితే.. ఈ పొదల్లో దాక్కున్న కుందేలును 5 సెకెన్లలో కనిపెట్టండి


ఫ్రాన్స్ అధ్యక్షుడిని కొట్టిన భార్య? వైరల్ అవుతున్న వీడియో చూస్తే


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 26 , 2025 | 07:36 PM