ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆ ఉంగరం కోసం ఆయన కొడుకులు చివరకు ఏం చేశాడంటే..

ABN, Publish Date - Jul 20 , 2025 | 10:06 AM

ఇది బిజీయుగం. తెల్లవారి నిద్ర లేచిన దగ్గర్నుంచీ అందరూ ఒకటే ఉరుకులు పరుగులు. ఎవరికీ దేనికీ తీరిక ఉండదు. వేచిచూసే ఓపిక ఉండదు. ముసలి తండ్రి ఆఖరి క్షణాల్లో ఉన్నాడంటే ఆయనకు ఇష్టమని హల్వా పట్టుకుని మరీ వచ్చేస్తారు ఆయన కొడుకులు. తీరా చూసే ఆయనేమో చనిపోయేలా లేడు. ముసలాయన వేలికి యాభైలక్షల రూపాయల విలువ చేసే వజ్రపుటుంగరం ఉంది.

- చావు చుట్టూ కామెడీ డ్రామా..

ఇది బిజీయుగం. తెల్లవారి నిద్ర లేచిన దగ్గర్నుంచీ అందరూ ఒకటే ఉరుకులు పరుగులు. ఎవరికీ దేనికీ తీరిక ఉండదు. వేచిచూసే ఓపిక ఉండదు. ముసలి తండ్రి ఆఖరి క్షణాల్లో ఉన్నాడంటే ఆయనకు ఇష్టమని హల్వా పట్టుకుని మరీ వచ్చేస్తారు ఆయన కొడుకులు. తీరా చూసే ఆయనేమో చనిపోయేలా లేడు. ముసలాయన వేలికి యాభైలక్షల రూపాయల విలువ చేసే వజ్రపుటుంగరం ఉంది. ఆయన బతికుండగా ఉంగరం తియ్యకూడదనేది ఓ షరతు. ఆ ఉంగరం కోసం ఆయన కొడుకులు చివరకు ఏం చేశారనేదే ‘పరివార్‌’ చిత్ర కథ.

తొంభై తొమ్మిదేళ్ళ భాస్కర్‌ పిళ్ళే ఆఖరి క్షణాల్లో ఉంటాడు. అప్పటికి అలాంటి ఆఖరి క్షణాలు చాలానే అయినాయి. ఎప్పటికప్పుడు కొడుకులు పరిగెత్తుకు రావడం, ఆయన లేచి కూర్చోవడం. ఏడాది కిందటే పోతాడనుకుని కార్డులు కూడా ప్రింట్‌ చేయిేస్త... వాటిని ప్రింట్‌ చేసిన కుర్రాడు ఏకంగా భాస్కర పిళ్ళే చేతికే అందిస్తాడు. ఊళ్ళో ఉన్న ఇద్దరు కొడుకులకు ఫరవాలేదు కానీ, వేరే ఊళ్ళో ఉద్యోగం చేేస రెండో కొడుకు తన సెలవులన్నీ అయిపోయి జీతం కూడా తెగ్గొడుతున్నారని వాపోతుంటాడు. వాళ్ళ కష్టాలు చూసి చూసి చివరకు బంధువులావిడ కూడా ‘‘ప్రాణం పోసిన దేవుడు దానిని తీసుకుపోవాలి కదా మరి’’ అంటూ సానుభూతి చూపిస్తుంది. అప్పుడు ఒక కోడలు గుడిలో ఆయన పేరుతో పూజ చేయించమని, దానికి అయ్యే ఖర్చు ఇచ్చేస్తానని ఉదారంగా చెబుతుంది. ఇంకో కోడలు అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఇత్తడి దీపపు సెమ్మె తోముతూనే ఉంటుంది.

భాస్కర పిళ్ళే తమ్ముడు కూడా అన్నను చూడడానికి వస్తాడు. జాతకాలు చూసే ఆయన్ని ... తమ తండ్రి ఎప్పుడు చనిపోతాడో చెప్పమని ఇద్దరు కొడుకులు ప్రాథేయ పడతారు. జాతకం చూసి ఆ రాత్రి తెల్లవారు జామున మూడు, నాలుగున్నర గంటల మధ్య పెద్దాయన చనిపోతాడని జోస్యం చెబుతాడు. ఇక అన్నదమ్ములు ఏర్పాట్లు మొదలెడతారు. ఫ్లెక్సీలు, షామియానాలు, ఇత్తడి సెమ్మెలు, ముక్కులో దూది ఉండలు తయారై పోతుంటాయి. ఆయన చనిపోతాడని అందరూ తెల్లార్లూ మేలుకునే కూర్చుంటారు. మూడు నాలుగు గంటలు ముగిసి తెల్లారిపోతుంది కానీ ముసలాయన చావడు... పైపెచ్చు లేచి కూర్చుంటాడు.

ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకడు ‘పెద్దాయన చేతికున్న ఉంగరాన్ని అమ్ముతామ’ని సిటీలోని ఒక బంగారు షాపు యజమాని నుంచి ఐదు లక్షలు అడ్వాన్సు తీసుకుంటాడు. ఉంగరం ఎప్పుడు ఇస్తారని ఆయన పదేపదే ఫోన్లు చేస్తుంటాడు. పెద్దాయనకు ఊపిరి అందటం కష్టంగా ఉందని ఆక్సిజన్‌ సిలండర్‌ అమరుస్తారు. తాతకు గాలి సరిపోవడం లేదని ఆయన మనుమడు సిలండరు వేగం పెంచుతాడు. ఆక్సిజన్‌ మాస్కులోంచి వేడి పొగలు వచ్చి భాస్కర పిళ్లే కథ పూర్తి అయి వజ్రపుటుంగరం కథ మొదలవుతుంది.

భాస్కర పిళ్ళే శౌర్యాన్ని మెచ్చుకుని బ్రిటీష్‌ అధికారి ఇచ్చిన ఆ ఉంగరం ఆయన వేలికి అతుక్కుపోయి ఒకపట్టాన ఊడిరాదు. ఒక దశలో అన్నదమ్ములు వేలు తెగనరుకుదామా అనుకుంటారు. అలా చేేస్త ఊళ్ళో వాళ్ళకు చెబుతానంటాడు చిన్న కొడుకు. అప్పుడు బంగారపు షాపు యజమాని ఒక ఉపాయం చెబుతాడు. ‘మృతదేహాన్ని ఉంగరంతో సహా తగలబెట్టమని, వజ్రం నిప్పులో కూడా కాలదు కాబట్టి తర్వాత తీసుకువచ్చి ఇమ్మంటాడు.

దహనం అయిన తర్వాత అస్తికలు మట్టికుండలోకి తీసి ఉంగరం కోసం గాలిస్తారు. అది అక్కడ ఉండదు. సీసీ టీవీ ఫుటేజీలో వెదికినా లాభం ఉండదు. దానికోసం ఇద్దరన్నదమ్ములు దహనం చేసిన గుంటలో పడి ఒకళ్ళని ఒకళ్లు కొట్టుకుంటారు. చివరికి అస్తికలు ఉంచిన మట్టికుండను కూడా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మార్చేసి గాలించి చూస్తారు. అక్కడ కూడా ఉండదు. బంగారం షాపు యజమాని తన అడ్వాన్సు వెనక్కి తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తుంటాడు. ఇంతకీ యాభై లక్షల ఖరీదు చేేస ఆ ఉంగరం ఏమయింది? అది ఎవరికి దొరికింది? అన్నదమ్ములు చివరికి ఏం చేశారు? అనేది మిగిలిన కథ.

ఇటీవల వచ్చిన ‘నారాయణేంటీ మున్నాన్మక్కల్‌’ సినిమా తల్లి చావు కోసం నిరీక్షించే ముగ్గురు కొడుకుల కథ అయినప్పటికీ అది ‘క్లాస్‌’ కథ. ‘పరివార్‌’ అలాంటి ముసుగులు, మర్యాదలు, నటనలు తీసివేసి... ఆస్తికోసం తెగబడిన అన్నదమ్ముల కథ. ఎలాంటి ముసుగులు లేకపోవడం వల్ల అత్యంత సహజంగా ఉన్న కథ. ఒక పెద్దాయన అంత్యక్షణాల నుంచి, విషాద భరితమైన సన్నివేశాల నుంచి కూడా హాయిగా నవ్వుకోగలిగిన చక్కటి ఆరోగ్యకరమైన హాస్యం పండించడంలో దర్శక, రచయితద్వయం ఉల్సవ్‌ రాజీవ్‌, ఫహాద్‌ నందు ప్రతిభ అడుగడుగునా కనిపిస్తూ చక్కలిగింతలు పెడుతుంది. అపూర్వ సహోదరుల పాత్రల్లో జగదీష్‌, ఇంద్రన్స్‌, ప్రశాంత్‌ అలెగ్జాండర్‌ అద్భుతంగా నటించారు. చిన్నాన్న పాత్రలో మీనరాజ్‌ పల్లరుత్తి అద్భుతమైన హాస్యాన్ని పండించాడు. ఈ కామెడీ డ్రామా అంతా ఒకే ఒక్క ఇంటి చుట్టూరా తిరగడం విశేషం. మొత్తానికి పరి‘వార్‌’ అంటే కుటుంబం అని కాకుండా, అన్నదమ్ముల మధ్య యుద్ధం అనిపించినా... మనం మర్చిపోతున్న కుటుంబ బంధాలు, మానవ సంబంధాలపై విసిరిన చూడచక్కటి వ్యంగ్యాస్త్రం.

- జి. లక్ష్మి, 94907 35322

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌లో సమూల మార్పులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 10:06 AM