Pakistan Filght: పాక్ విమానానికి ఇసుక తుఫాన్ దెబ్బ.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
ABN, Publish Date - May 26 , 2025 | 06:31 PM
భారీ వర్షాలు, మంచు, ఈదురుగాలులు, పొగమంచు విమానాలను ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండాలి. తాజాగా పాకిస్థాన్ విమానంలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు భయంకర అనుభవం ఎదురైంది.
వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా విమాన ప్రయాణాలు (Flight Journey) చాలా ప్రమాదకరం. భారీ వర్షాలు, మంచు, ఈదురుగాలులు, పొగమంచు విమానాలను ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండాలి. తాజాగా పాకిస్థాన్ విమానంలో (Pakistan Filght) ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు భయంకర అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానాన్ని ఇసుక తుఫాన్ (sand storm) చుట్టుముట్టింది (Viral Video).
గత శనివారం పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి లాహోర్‌కు ఫ్లై జిన్నా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బయల్దేరింది. లాహోర్‌లో ఆ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఇసుక తుఫాన్‌లో చిక్కుకుంది. ఆ ఇసుక తుఫాన్ చాలా బలంగా ఉండడం వల్ల విమానం కాసేపు బ్యాలెన్స్ కోల్పోయింది. ఆ తుఫాన్ ధాటికి విమానం మొత్తం వణికిపోయింది. దీంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కొందరు ఏడుస్తూ, మరికొందరు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.
లాహోర్ విమానాశ్రయం రన్‌వే మీదకు వచ్చిన విమానాన్ని పైలెట్ తిరిగి టేకాఫ్ చేశాడు. ల్యాండింగ్ సాధ్యం కాదని తేలడంతో అక్కడే గాల్లో పలు రౌండ్లు కొట్టిన విమానం తిరిగి కరాచీకి వెళ్లిపోయింది. అక్కడ పరిస్థితి అనుకూలంగానే ఉండడంతో సేఫ్‌గా ల్యాండ్ అయింది. మొత్తానికి చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్ ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు. ఆ భయంకర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ పొదల్లో దాక్కున్న కుందేలును 5 సెకెన్లలో కనిపెట్టండి
ఫ్రాన్స్ అధ్యక్షుడిని కొట్టిన భార్య? వైరల్ అవుతున్న వీడియో చూస్తే
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 26 , 2025 | 08:11 PM