ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Aura Dance: బెంజి కారుపై డ్యాన్స్.. చిక్కుల్లో ముంబై కపుల్

ABN, Publish Date - Jul 25 , 2025 | 08:21 PM

Viral Aura Dance: కొన్ని రోజుల క్రితం ఇద్దరూ ఖర్గర్ ఏరియాలో తమ బెంజ్ కారులో వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నజీమ్ కారు దిగి బోనెట్ పైకి ఎక్కింది. అల్ఫేష్ కారును ముందుకు పోనిచ్చాడు.

Viral Aura Dance

సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలని కొందరు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు.. కోట్లకు పడగలు ఎత్తిన వాళ్లు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ముంబైకి చెందిన ఓ జంట చేసిన పని వారిని జైలు పాలు చేసే స్థితికి తీసుకొచ్చింది. బెంజ్ కారుపై డ్యాన్స్ వాళ్ల కొంప ముంచింది. ఇంతకీ సంగతేంటంటే.. నవీ ముంబైకి చెందిన నజిమ్ సుల్దే, అల్ఫేష్ షేక్ భార్యాభర్తలు. వీరిద్దరికీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి.

వాటిలో వింత, విచిత్రమైన వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ ఖర్గర్ ఏరియాలో తమ బెంజ్ కారులో వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నజీమ్ కారు దిగి బోనెట్ పైకి ఎక్కింది. అల్ఫేష్ కారును ముందుకు పోనిచ్చాడు. కారు రన్నింగ్‌లో ఉండగానే ఆమె దాని మీద నిలబడి డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు చర్యలకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ క్షమాపణ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. తాము అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని అన్నారు. వారు మాట్లాడుతూ.. ‘మేము చేసిన తప్పును ఒప్పుకుంటున్నాం. కానీ, జైలు శిక్ష పడేంత పెద్ద తప్పు మేము ఏం చేశాం. మా ఇంటికి పోలీసులు వచ్చారు. మమ్మల్ని కారులో స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ ఐదు గంటలు ఉన్నాము. మాకు సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. అలా అవ్వకూడదని దేవుడ్ని ప్రార్థిస్తున్నాము’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఉపేంద్ర హీరో అవ్వడానికి కారణం ఈ సీనియర్ హీరోయినే..

డ్రైవర్ కొంపముంచిన పనస పండు.. తప్పు చేయకున్నా..

Updated Date - Jul 25 , 2025 | 08:40 PM