ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: స్నేహం అంటే ఇదేరా.. ఆస్పత్రినుంచి నేరుగా ఫ్రెండ్ పెళ్లికి..

ABN, Publish Date - Jun 02 , 2025 | 01:26 PM

Viral Video: శరీరం మొత్తం బ్యాండేజీలు ఉన్నా సరే.. కొంతమంది స్నేహితుల సాయంతో పెళ్లికి వెళ్లాడు. ఓ ఇద్దరు మిత్రులు అతడ్ని చెరో వైపు పట్టుకుని పెళ్లి కొడుకు దగ్గరకు తీసుకెళ్లారు.

Viral Video

‘Friendship Does Not Count The Miles. It Counts The Memories’ అని ఇంగ్లీష్‌లో ఓ కొటేషన్ ఉంది. నిజమైన స్నేహితులు మన నుంచి విలువైన బహుమతుల్ని ఆశించరు. మనతో గడిపిన క్షణాల్నే విలువైనవిగా భావించి..ఆ జ్ణాపకాలతో బతికేస్తారు. మన కష్ట, నష్టాల్లో తోడుంటారు. మనకు మంచి జరుగుతుందంటే.. మనకంటే వాళ్లే ఎక్కువగా సంతోషిస్తారు. స్నేహమంటే ఇదేరా అనిపించే సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలానే జరిగాయి.


తాజాగా, ఓ యువకుడు తన స్నేహితుడి కోసం దుస్సాహసం చేశాడు. తన ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టుకుని మరీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువకుడు కొన్ని రోజుల క్రితం ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం ఆ యువకుడి ఫ్రెండ్ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి ఎలాగైనా వెళ్లాలని ఆ యువకుడు అనుకున్నాడు.


శరీరం మొత్తం బ్యాండేజీలు ఉన్నా సరే.. కొంతమంది స్నేహితుల సాయంతో పెళ్లికి వెళ్లాడు. ఓ ఇద్దరు మిత్రులు అతడ్ని చెరో వైపు పట్టుకుని పెళ్లి కొడుకు దగ్గరకు తీసుకెళ్లారు. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు అతడ్ని చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ జవాన్ సినిమాలో హీరో ఎంట్రీ ఇచ్చినట్లు ఇచ్చాడు’.. ‘ నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఇదే’.. ‘ ఈ వీడియోకు సెకండ్ పార్ట్ ఏమైనా ఉందా’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ యువకుడు నిజంగానే గాయాలపాలై.. బ్యాండేజీలతో పెళ్లికి వెళ్లాడా.. లేక పెళ్లి కోసం ప్రాంక్ చేశాడా అన్నది తెలియరాలేదు.


ఇవి కూడా చదవండి

శారీరకంగా సుఖం కోసం అమ్మాయి వేధింపులు.. యువకుడు ఆత్మహత్య..

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. సాధారణ బదిలీల గడువు పొడిగింపు..

Updated Date - Jun 02 , 2025 | 02:05 PM