Viral: పాడుపడిన ఇంట్లో గుప్త నిధి.. నెట్టింట వీడియో వైరల్
ABN, Publish Date - Jan 24 , 2025 | 11:47 PM
పాడుబడిన ఇంట్లోని గోడలో ఓ వ్యక్తికి కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు డబ్బులు కూడబెట్టేందుకు రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడతారు. రోజుకు 14 గంటల పాటు శ్రమిస్తూ కుటుంబ సభ్యుల అవసరాలను తీరుస్తారు. అయితే, కొందరికి మాత్రం ఇవేమీ అవసరం లేకుండానే కనకవర్షం కురుస్తోంది. సరిగ్గా ఇలాంటి వ్యక్తి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో నిజమా లేక ఫేకా అన్న విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ జనాలకు మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది(Viral).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి మెటల్ డిటెక్టర్, ఓ జాగిలాన్ని తీసుకుని పాడుబడిన ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ మెటల్ డిటెక్టర్‌తో గోడలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాడు. ఇంతలో మెటల్ డిటెక్టర్ ఒక్కసారిగా పెద్ద శబ్దం చేయడంతో అతడు అలర్ట్ అయ్యాడు. డిటెక్టర్ సిగ్నల్‌ను బట్టి గోడపై సిరాతో మార్క్ చేసి దాన్ని సుత్తితో కొట్టడం ప్రారంభించాడు (Treasure hidden in Wall).
Student Threatens Prinicipal: స్మార్ట్ ఫోన్ వ్యసనంతో పెడతోవ పట్టి.. ఏకంగా ప్రిన్సిపాల్‌కే దమ్కీ!
గోడపై రెండు మూడు సార్లు సుత్తితో కొట్టాక చిన్న రంధ్రం ఏర్పడింది. లోపల ఏదో ఉన్నట్టు అతడికి అస్పష్టంగా కనిపించింది. లోపల చేయిపెట్టగా చేతికి ఓ చిన్న బ్యాగ్ కనిపించింది. దాన్ని కావాలనే ఎవరో గోడలోపల దాచి ఉంచారని అతడికి అర్థమైంది. అతడి కుతూహలం మరింత పెరిగింది. ఈ క్రమంలో గోడలోని మరిన్ని ఇటుకలు తొలగించి చూడగా ఓ ఇనుప కప్పు చేతికి తగిలింది. తొలుత దాని మూతను యటకు తీశాడు. ఆ తరువాత కప్పు మొత్తాన్ని బయటకు లాగాడు. ఆ తరువాత కప్పులోపల చూస్తే అతడికి దిమ్మతిరిగినంత పనైంది. అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి.
Visa Woes: మొదలైన ట్రంప్ దబిడిదిబిడి! పిల్లల్ని చూసేందుకు అమెరికాకు వెళ్లితే ఎయిపోర్టులోనే..
ఇక ఈ వీడియో జనాలకు విపరీతంగా నచ్చడంతో ఏకంగా 68 లక్షల వరకూ వ్యూస్ వచ్చాయి. జనాలు కామెంట్స్ వరద పారించారు. అతడి లక్ బాగుందని కొందరు అన్నారు. ఇలాంటివి తమ జీవితంలో ఎందుకు జరగవని మరికొందరు నిరాశ వ్యక్తం చేశారు. కొందరు మాత్రం కప్పులో డబ్బు ఉండటంపై నిరాశ వ్యక్తం చేశారు. దీనికి బదులు ఏ భూతమో బయటకు వచ్చి ఉంటే మరింత సంతోషించి ఉండేవారమని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో జనాలకు బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Sweaters for Elephants: మానవత్వం అంటే ఇదీ.. ఏనుగులు చలికి తట్టుకోలేకపోతున్నాయని..
Updated Date - Jan 24 , 2025 | 11:48 PM