Student Threatens Prinicipal: స్మార్ట్ ఫోన్ వ్యసనంతో పెడతోవ పట్టి.. ఏకంగా ప్రిన్సిపాల్‌కే దమ్కీ!
ABN , Publish Date - Jan 24 , 2025 | 10:09 PM
తన సెల్‌ఫోన్ లాక్కున్నారని ప్రిన్సిపాల్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన ఓ స్టూడెంట్ ఆయనను చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. కేరళలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ పెను కలకాలనికి దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ వ్యసనం పిల్లల్ని కట్టుతప్పేలా చేస్తోంది. చిన్నాపెద్దా తారతమ్యం మరిచి రెచ్చిపోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడేలా చేస్తోంది. ఇందుకు సంబంధించి కేరళలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది (Student Threatens Prinicipal).
పాలక్కాడ్‌లోని అనక్కర ప్రభుత్వ హైయ్యర్ సెకెండరీ స్కూల్‌లో చదువుతున్న ఓ విద్యార్థి ఏకంగా ప్రిన్సిపాల్‌కే ధమ్కీ ఇచ్చాడు. తన ఫోన్ లాక్కున్నాడని రెచ్చిపోయిన అతడు.. ప్రిన్సిపాల్‌ను బయట కాలుపెడితే చంపేస్తానంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. మరో టీచర్ ఈ ఉదంతాన్ని కెమెరాలో రికార్డు చేసింది. ఇది సోషల్ మీడియా బాట పట్టడంతో రాష్ట్రంలో పెను కలకలానికి దారి తీసింది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఈ మంగళవారం ఉదంతం వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టించింది (Viral).
Bill Gates: స్కూలు రోజుల్లో టీచర్‌కు షాకిచ్చిన బిల్ గేట్స్! కబేళా నుంచి ఏకంగా..
స్కూలుకు సంబంధించి ప్రేరెంట్ టీచర్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం, విద్యార్థులు క్లాస్‌రూంలోకి ఫోన్లు తీసుకురాకూడదు. అయితే, నిబంధనలు అతిక్రమించిన సదరు విద్యార్థి నుంచి టీచర్ ఫోన్ తీసుకున్నారు. విషయం ప్రన్సిపాల్ వద్దకు చేరాక విద్యార్థి రెచ్చిపోయాడు. ప్రిన్సిపాల్, టీచర్ అని కూడా చూడకుండా భారీ వార్నింగ్‌లు ఇచ్చేశాడు. మరోవైపు పీటీఏ వారు పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విద్య శాఖ తెలిపింది.
Sweaters for Elephants: మానవత్వం అంటే ఇదీ.. ఏనుగులు చలికి తట్టుకోలేకపోతున్నాయని..
మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి వి శివన్ కుట్టి కూడా స్పందించారు. తక్షణ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నివేదికను డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్‌కు సమర్పించాలని ఆదేశించారు. పిల్లలు ఇలా మాట్లాడడం ఆశ్చర్యకరమని అన్నారు. అయితే, పిల్లల్ని సరిద్దిద్దడం పేరిట కొట్టడం లేదా తిట్టడం చేయకూడదని స్పష్టం చేశారు. ఇక విద్యార్థిపై సస్పెన్షన్ వేటు పడినట్టు కూడా తెలుస్తోంది. అతడిపై పీటీఏ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
మరోవైపు, విద్యార్థి వీడియో నెట్టింట వైరల్ కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థి ముఖాన్ని బర్ల్ చేయకుండా వీడియోను ఎలా బయటపెట్టారని అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు ట్రోలింగ్ బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.