Little Girl Rides: చిన్న పాపకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఖర్చు రెండు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు..
ABN, Publish Date - May 25 , 2025 | 07:44 PM
Little Girl Rides: ఓ పాప రోడ్డు దాటుతూ ఉంది. ఆ పాప చుట్టూ ఎనిమిదికిపైగా కుక్కలు ఉన్నాయి. సెక్యూరిటీ లాగా ఆమె చుట్టూ నడవసాగాయి. ఆ పాప ఓ తెల్ల కుక్కపై కూర్చుని సవారీ చేస్తూ ఉంది.
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలలా జరిగే వింతలు విశేషాలు ఇంట్లో కూర్చొని చూడగలుగుతున్నాం. రీల్స్, షార్ట్స్ రూపంలో ఎక్కడెక్కడో జరిగే సంఘటనలు మన కళ్ల ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. వాటిలో కొన్ని మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాయి. మరికొన్ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో మనసుకు హత్తుకునే వీడియోలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటనకు సంధించిన వీడియో కూడా ఈ కోవకు చెందినదే.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ పాప రోడ్డు దాటుతూ ఉంది. ఆ పాప చుట్టూ ఎనిమిదికిపైగా కుక్కలు ఉన్నాయి. సెక్యూరిటీ లాగా ఆమె చుట్టూ నడవసాగాయి. ఆ పాప ఓ తెల్ల కుక్కపై కూర్చుని సవారీ చేస్తూ ఉంది. కుక్క కూడా ఏమీ అనకుండా ముందుకు వెళుతూ ఉంది. డివైడర్ రాగానే అది ఆగిపోయింది. కుక్క బాధను అర్థం చేసుకున్న పాప కిందకు దిగింది. డివైడర్ దాటగానే ఆ మళ్లీ కుక్కపై కూర్చుంది. అక్కడినుంచి వెళ్లిపోయింది.
ముసాఫిర్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశాడు. ‘ఆ పాప కుక్కల ప్రేమను గెలుచుకుంది. అందుకే అవి అంత ప్రేమిస్తున్నాయి. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాయి’ అని రాసుకొచ్చాడు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ ఈ జెడ్ ప్లస్ సెక్యూరిటీ చాలా కాస్ట్‌లీ.. రెండు పార్లేజీ బిస్కట్ ప్యాకెట్లు ఇవ్వాల్సిందే’..‘ ఈ సెక్యూరిటీ ముందు ఏ సెక్యూరిటీ కూడా పనికి రాదు’.. ‘ కుక్కల సవారీ చేస్తున్న డాగ్ క్వీన్ ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Annabelle Doll: ఎంతో మందిని భయపెట్టిన దెయ్యం బొమ్మ గల్లంతు..
Allu Aravind: తెలంగాణలో ఒక్క థియేటర్ కూడా లేదు.. పవన్ కల్యాణ్ పేషీ నోట్‌పై అల్లు అరవింద్..
Updated Date - May 25 , 2025 | 07:45 PM