ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: తిండి పెట్టిన మనిషిపై విశ్వాసం.. కడ వరకు అతడి వెంటే..

ABN, Publish Date - Jun 11 , 2025 | 08:17 AM

Langur Moans: శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో.. ఓ కొండముచ్చు అక్కడికి వచ్చింది. నేలపై ఉంచిన పాడె దగ్గర కూర్చుంది. తనకు తిండిపెట్టిన వ్యక్తిలో ఎలాంటి చలనం లేకపోవటంతో దానికి అనుమానం వచ్చింది.

Langur Moans

మనుషులకు జంతువులకు మధ్య విశ్వాసం విషయంలో చాలా తేడా ఉంది. మనుషులకు మనం ఎంత సాయం చేసినా.. ఏం చేశావు అని అంటారు. అదే జంతువులు అయితే.. ఓ సారి తినడానికి ఏదైనా ఇస్తే.. చచ్చేంత వరకు విశ్వాసంగా ఉంటాయి. ఒక్కోసారి మన కోసం వాటి ప్రాణాలనైనా ఇస్తాయి. తాజాగా, ఉత్తర భారత దేశంలో కన్నీళ్లు పెట్టించే ఒక సంఘటన వెలుగు చూసింది. ఓ కోతి చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొంది. శవాన్ని కాల్చే వరకు పక్కకు వెళ్లలేదు. తినడానికి తిండి పెట్టిన ఆ వ్యక్తి మరణం తట్టుకోలేక ఎంతో బాధపడింది.

ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని డియోగర్ గ్రామానికి చెందిన మున్నా సింగ్‌కు జంతువులంటే ప్రాణం. వాటికి ప్రతీ రోజూ తినడానికి ఏమైనా పెడుతూ ఉండేవాడు. ముఖ్యంగా అతడికి కోతులంటే బాగా ఇష్టం. వాటికి రొట్టెలు, అరటి పళ్లు లాంటివి పెడుతూ ఉండేవాడు. అయితే, కొద్దిరోజుల క్రితం మున్నా సింగ్ చనిపోయాడు. అంత్యక్రియల్లో భాగంగా శవాన్ని పాడెపైకి ఎక్కించారు.

శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో.. ఓ కొండముచ్చు అక్కడికి వచ్చింది. నేలపై ఉంచిన పాడె దగ్గర కూర్చుంది. తనకు తిండిపెట్టిన వ్యక్తిలో ఎలాంటి చలనం లేకపోవటంతో దానికి అనుమానం వచ్చింది. అతడి మూతి దగ్గర తల పెట్టి వాసన చూసింది. చనిపోయాడని దానికి కూడా అర్థం అయింది. కొద్దిసేపటి తర్వాత శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లారు. అది అక్కడికి కూడా వెళ్లింది. శవాన్ని కాల్చడానికి ముందు కర్రలపైకి ఎక్కి కూర్చుంది. అతడి శవం కాలి బూడిద అయ్యే వరకు శ్మశానంలోనే ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

నిప్పురవ్వ.. పెను జ్వాలై..

6 ఏళ్ల కూతురిని వాటర్ టబ్బులో ముంచి..

Updated Date - Jun 11 , 2025 | 10:42 AM