ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kantara Chapter 1: వరుస ప్రమాదాలు.. కాంతార షూటింగ్‌లో బోల్తాపడ్డ బోటు

ABN, Publish Date - Jun 15 , 2025 | 07:45 AM

Kantara Chapter 1: రాత్రి వేళ సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, పడవ బోల్తా పడిపోయింది. షూటింగ్ సమయంలో పడవలో 30 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Kantara Chapter 1

కాంతార సినిమా టీమ్‌ను వరుస విషాదాలు, ప్రమాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. సినిమా టీం ఆ విషాదం నుంచి తేరుకోలేదు. ఇంతలోపే కాంతార సినిమా టీమ్ ఓ ప్రమాదం బారిన పడింది. రిజర్వాయర్‌లో షూటింగ్ చేస్తుండగా బోటు బోల్తా పడిపోయింది. మస్తికట్టలోని మని రిజర్వాయర్‌లో తాజాగా షూటింగ్ జరిగింది.

రాత్రి వేళ సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఏమైందో ఏమో తెలీదు కానీ, పడవ బోల్తా పడిపోయింది. షూటింగ్ సమయంలో పడవలో 30 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా హీరో రిషబ్ శెట్టి కూడా అందులో ఉన్నట్లు సమాచారం. అదృష్టం కొద్ది ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. అందరూ క్షేమంగా ఒడ్డుకు ఈత కొట్టుకుంటూ వచ్చేశారు. అయితే, షూటింగ్ కోసం తీసుకెళ్లిన కెమెరాలు, ఇతర వస్తువులు నీటిలో మునిగిపోయాయి. వరుస విషాదాలు, ప్రమాదాలతో భయంతో ఉన్న సినిమా టీమ్‌ను పడవ బోల్తా ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తోంది.

కాగా, 2024, నవంబర్ నెలలో జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. 6 మంది తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు గాలి వానకు సినిమా సెట్ మొత్తం పాడైంది. మే నెలలో కేరళకు చెందిన కపిల్ అనే జూనియర్ ఆర్టిస్టు నదిలో ఈతకు వెళ్లి చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రాకేష్ పూజారి అనే నటుడు గుండెపోటుతో చనిపోయాడు. జూన్ 13వ తేదీన జూనియర్ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో మరణించాడు. ఇలా వరుస విషాదాలు ప్రమాదాలు కాంతార టీమ్‌ను వెంటాడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

పసిడి ప్రియులకు అలర్ట్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు

ఆరుగురు పిల్లలున్న జాబితా పునఃపరిశీలన

Updated Date - Jun 15 , 2025 | 08:02 AM