Talli Ki Vandanam Scheme: ఆరుగురు పిల్లలున్న జాబితా పునఃపరిశీలన
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:29 AM
ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలున్న తల్లుల జాబితా పునఃపరిశీలన అనంతరం వారికి కూడా తల్లికి వందనం పథకం నగదు జమ అవుతుందని పాఠశాల విద్యా శాఖ శనివారం తెలిపింది.
ఆ తర్వాత వారికీ తల్లికి వందనం పథకం అమలు
అమరావతి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలున్న తల్లుల జాబితా పునఃపరిశీలన అనంతరం వారికి కూడా తల్లికి వందనం పథకం నగదు జమ అవుతుందని పాఠశాల విద్యా శాఖ శనివారం తెలిపింది. ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరికీ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. అర్హులు, అనర్హుల జాబితాలన్నీ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాయని, నగదు రానివారు సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హత ఉన్నట్లు రుజువైతే నగదు విడుదల అవుతుందని వివరించింది.