ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో.. బావిలో పడిన బంతిని ఎలా తీశారో చూడండి..

ABN, Publish Date - Jun 17 , 2025 | 03:37 PM

మన దేశంలో తెలివైన వారికి కొదవ లేదు. ఎంత క్లిష్టమైన సమస్యనైనా తమ తెలివితేటలతో సులభంగా పరిష్కరించే వారు కోకొల్లలుగా ఉన్నారు. పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలు కూడా తమకెదురైన సమస్యలకు సులభంగా పరిష్కారాలు కనుగొంటారు.

jugaad trick

మన దేశంలో తెలివైన వారికి కొదవ లేదు. ఎంత క్లిష్టమైన సమస్యనైనా తమ తెలివితేటలతో సులభంగా పరిష్కరించే వారు కోకొల్లలుగా ఉన్నారు. పెద్దలు మాత్రమే కాదు.. పిల్లలు కూడా తమకెదురైన సమస్యలకు సులభంగా పరిష్కారాలు కనుగొంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆ కుర్రాళ్ల తెలివితేటలను (Intelligence) ప్రశంసించకుండా ఉండలేరు.

idiotic_sperm అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ లోతైన బావిలో ఆ కుర్రాళ్లు ఆడుకుంటున్న బాల్ పడిపోయింది. ఆ బావిలో నీళ్లు లేవు. ఆ బావిలోకి దిగి బంతిని తీసేందుకు ఆ కుర్రాళ్లు అద్భుతమైన ప్లాన్ వేశారు. ఓ చీర తీసుకొచ్చి దానిని ఉయ్యాల తరహాలో కట్టి ఓ చిన్న కుర్రాడిని అందులో కూర్చోబెట్టారు. అనంతరం ఆ చీరను ఆ బావిలోకి దించారు. ఆ కుర్రాడు బావిలో పడి ఉన్న బంతిని పట్టుకుని తిరిగి ఆ చీరలో కూర్చున్నాడు.

పైన ఉన్న కుర్రాళ్లు ఆ చీరను పైకి లాగేశారు. దీంతో చాలా సులభంగా ఆ బంతి పైకి వచ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ చేసి ఆ వీడియోలోని కుర్రాళ్ల తెలివితేటలను ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ చూపు షార్ప్ అయితే.. ఈ గదిలో పిల్లి ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి


Viral Video: వామ్మో.. మేకప్ మాయ అంటే ఇదే.. వధువు చేసిన పని తెలిస్తే షాకవకుండా ఉండలేరు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 17 , 2025 | 05:02 PM