Nita Ambani Expensive Car: వామ్మో.. నీతా అంబానీ కారు.. ఖరీదెంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే..
ABN, Publish Date - Aug 11 , 2025 | 12:15 PM
అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు తిరగాల్సిందే.
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భార్య నీతా అంబానీ చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఎంతో ఖరీదైన వస్తువులు వాడుతుంటారు. నీతా అంబానీ (Nita Ambani) గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ స్వంతం చేసుకున్న ఓ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు తిరగాల్సిందే. ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు (Nita Ambani Expensive Car).
నీతా అంబానీ సొంతం చేసుకున్న ఆ కారు పేరు ఆడీ ఏ9 చమేలియన్ (Audi A9 Chameleon). ఈ కారు ఖరీదు అక్షరాలా వంద కోట్ల రూపాయలు (Rs.100 crore Car). ఈ కారులో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయట. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే.. ఈ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చుకోగలదట. ఈ కారు ఎప్పటికప్పుడు తన రంగులను మార్చుకుంటుందట. ఒక్క బటన్ నొక్కితే చాలు.. కారు రంగు మారిపోతుందట. ఈ కారు పెయింటింగ్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 11 మాత్రమే ఉన్నాయట.
ఈ కారు సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్‌తో స్పేష్ షిప్‌లా కనిపిస్తుంది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు అయిన ఈ ఆడి ఏ9 చమేలియన్ రెండు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ కారులో 4.0-లీటర్ V8 ఇంజిన్ అమర్చారు. ఇది 600 సీసీ హార్స్‌పవర్‌ను అందిస్తుంది. కేవలం మూడున్నర సెకన్లలో 0 నుంచి 100 కి.మీ./గం. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కి.మీ. అందుకే నీతా అంబానీకి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
కస్టమర్ల ఆరోగ్యం అంటే లేక్కే లేదు.. ఆయిల్ ప్యాకెట్లను ఎలా విప్పుతున్నాడో చూడండి..
ఆ కుక్క మనసు ఎంత గొప్పది.. చిన్న పిల్లలను కాపాడడానికి ఎలా పరిగెత్తిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 11 , 2025 | 12:15 PM