ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Filthy NYC Subway: ఇండియాను అంటారా? ఓ సారి అమెరికాలో పరిస్థితి చూసుకోండి..

ABN, Publish Date - Jul 27 , 2025 | 05:32 PM

Filthy NYC Subway: అమెరికా టూరుకు వెళ్లిన ఓ వ్లాగర్ న్యూయార్క్ సిటీలోని చీకటి కోణాన్ని బయటపెట్టాడు. న్యూయార్క్ సిటీలోని సబ్‌వేను వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

Filthy NYC Subway

అమెరికా అంటే శుభ్రత.. శుభ్రత అంటే అమెరికా అన్నంతలా అక్కడి వాళ్లు తెగ ఫోజుకొడుతుంటారు. ఇక, ఇండియా మీద దారుణమైన కామెంట్లు చేస్తుంటారు. అమెరికాలోని కొంతమందిని ‘అపరిశుభ్రమైన దేశం ఏది?’ అని అడగ్గా .. వారిలో చాలా మంది ఇండియా పేరు చెప్పారు. అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ ఏదైనా చిన్న తప్పు చేస్తే.. ‘మా దేశాన్ని పాడు చేయడానికి వచ్చారు’ అంటూ మండిపడుతూ ఉంటారు. అయితే, పైన పటారం లోన లొటారం అన్నట్లుగా అమెరికా పరిస్థితి ఉంటుంది.

అమెరికాలో కూడా స్లమ్‌కంటే దారుణమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తాజాగా, అమెరికా టూరుకు వెళ్లిన ఓ వ్లాగర్ న్యూయార్క్ సిటీలోని చీకటి కోణాన్ని బయటపెట్టాడు. న్యూయార్క్ సిటీలోని సబ్‌వేను వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ‘విపరీతమైన వాడకం, ఏళ్ల నాటి నిర్మాణం, సరిగా క్లీన్ చేయకపోవటం, మెయిన్‌టెన్స్ లేకపోవటం కారణంగా.. న్యూయార్క్ సిటీ సబ్‌వే చెండాలంగా తయారైంది’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అమెరికాలో ఇంత దారుణమైన ప్రదేశాలు కూడా ఉన్నాయా? చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’..‘న్యూయార్క్ సబ్‌వేతో పోల్చుకుంటే మన ఇండియన్ మెట్రో స్టేషన్‌లు వంద రెట్లు శుభ్రంగా ఉంటాయి’..‘ఇండియా గురించి తప్పుగా మాట్లాడే అమెరికా వాళ్లకు ఈ వీడియో చూపించాలి. దెబ్బకు నోరు మూసుకుంటారు’..‘న్యూయార్క్ నగరంలోని సబ్‌వే పరిస్థితికి సంబంధించిన వీడియోను షేర్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చిటికెలో తిరుమల శ్రీవారి దర్శనం.. ఇదిగో ఇలాగా

నెటిజన్‌కు అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Updated Date - Jul 27 , 2025 | 05:42 PM