ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Origin Couple: ఇండియన్స్ అంటే అంత చిన్న చూపా.. అంత దారుణంగా అంటారా?..

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:32 PM

Indian Origin Couple: స్టాన్‌లీ చెప్పింది నిజమే చెత్త పారేయాలనుకుంటే అంత సేపు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కవర్లతో సహా పారేసి వెళ్లి పోవచ్చు. వాళ్లు అలా చేయలేదు. కవర్లలోంచి తీసేసిన వాటిని దూరంగా .. ఆ ప్రాంతం మొత్తం వేశారు.

Indian Origin Couple

సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రజలు జడ్జిమెంటల్‌‌గా తయారు అయ్యారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. తాము చూసిందాన్నే నిజం అని నమ్ముతున్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. ప్రస్తుతం కెనాడాలో ఉంటున్న ఓ ఇద్దరు ఇండియన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెబీ బ్లడ్‌క్లాట్ అనే యువతి తన ఎక్స్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేసింది. ‘వాళ్ల దేశాన్ని వాళ్లు ఓ టాయిలెట్‌లాగా మార్చేసుకున్నారు. ఎంతో శుభ్రమైన కెనడాను పాడు చేస్తున్నారు. వీడియో తీసి వదిలేయకూడదు.

వారికి శిక్ష పడేలా చేయాలి’ అని పేర్కొంది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ ఇద్దరు ఇండియన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి ఇండియన్స్ కూడా వారిపై మండిపడుతున్నారు. సలీల్ నాయర్ అనే నెటిజన్..‘నేను ఇండియన్‌ను. నేను అలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా రక్తం మరిగిపోతోంది. వారిని క్షమించకూడదు. మనం ఎక్కడికి వెళ్లాం.. ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అన్నది కాదు.. పద్ధతిగా ఉండాలి. మీలాంటి వారి వల్లే ఇండియా పాడవుతోంది’ అని అన్నాడు.

ఇలా చాలా మంది వారిపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఒక్కడు మాత్రం అక్కడ ఏం జరిగి ఉంటుందో రెండో కోణంలో చూడగలిగాడు. స్టాన్‌లీ రాబర్ట్స్ అనే నెటిజన్ స్పందిస్తూ.. ‘అది చెత్త అయితే గనుక ఒకే సారి దాన్ని పాడేసేవారు. బ్యాగుతో సహా చెత్తను పాడేసేవారు. వాళ్లు అడవి జంతువులకు ఆహారం వేస్తున్నట్లుగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నాడు. స్టాన్‌లీ చెప్పింది నిజమే చెత్త పారేయాలనుకుంటే అంత సేపు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కవర్లతో సహా పారేసి వెళ్లి పోవచ్చు. వాళ్లు అలా చేయలేదు. కవర్లలోంచి తీసేసిన వాటిని దూరంగా .. ఆ ప్రాంతం మొత్తం వేశారు. బహుశా అది అడవి జంతువుల కోసమే కావచ్చు.

ఇవి కూడా చదవండి

శాలువా కప్పి వీధి కుక్కలకు సన్మానం.. కారణం ఏంటంటే..

ఆన్‌లైన్‌ జూదంలో రూ.15 లక్షల నష్టం.. యువకుడి ఆత్మహత్య

Updated Date - Jul 15 , 2025 | 12:40 PM