ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Husband And Wife: సజీవ సమాధికి సిద్ధమైన భార్యాభర్తలు.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:46 PM

Husband And Wife: ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంటి దగ్గర ఉండే ఖాళీ స్థలంలో గుంత తవ్వారు. అందులో ఇద్దరూ పడుకున్నారు. గొంతు వరకు మట్టి కప్పేసుకున్నారు. విషయం తెలుసుకున్న సలీమ్ పూర్ ఎస్‌ఎమ్‌డీ దిశా శ్రీవాస్తవ అక్కడి వెళ్లారు.

Husband And Wife

ప్రభుత్వ అధికారులు తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ భార్యాభర్తలు తీవ్రంగా కలత చెందారు. ఈ నేపథ్యంలోనే ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. బతికి ఉండటం వృధా అని భావించి సజీవ సమాధికి సిద్ధమయ్యారు. తమను తాము భూమిలో కప్పిపెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. వాళ్లను అడ్డగించారు. ఇంతకీ ఆ భార్యాభర్తలు ఎందుకు సజీవ సమాధి అవ్వాలనుకున్నారో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్ డియోరా జిల్లా పత్లాపూర్ గ్రామానికి చెందిన రామ్ నరేష్, గుచ్చీ దేవీ భార్యాభర్తలు. ఈ దంపతులు గ్రామంలోని ఓ ప్రభుత్వ స్థలాన్ని చాలా ఏళ్ల క్రితం ఆక్రమించారు. అయితే, ఆ స్థలాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తలు గ్రామ సభను ఆశ్రయించారు. ఆ స్థలాన్ని తమకు కేటాయించాలని కోరారు. అయితే, అధికారులు అందుకు ఒప్పుకోలేదు. రామ్ నరేష్, గుచ్చీ దేవీ ఎంత ప్రాథేయపడ్డా వినలేదు. స్థలం ఖాళీ చేయించారు. దీంతో వారు మనస్తాపానికి గురయ్యారు. ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంటి దగ్గర ఉండే ఖాళీ స్థలంలో గుంత తవ్వారు. అందులో ఇద్దరూ పడుకున్నారు. గొంతు వరకు మట్టి కప్పేసుకున్నారు. దంపతుల సజీవ సమాధి గురించి సలీమ్ పూర్ ఎస్‌ఎమ్‌డీ దిశా శ్రీవాస్తవకు తెలిసింది.


ఆమె వెంటనే అక్కడికి వెళ్లింది. వారిని అడ్డుకుంది. బలవంతంగా వారిని సమాధినుంచి పక్కకు తీసుకువచ్చింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ గుచ్చీ దేవి స్థలం కావాలని పట్టుబడుతోంది. ఆ కుటుంబానికి ఇది వరకే ఇళ్లు ఉండటంతో .. స్థలం ఇవ్వలేదు’ అని తెలిపింది. ఇక, గచ్చీ దేవి దీని గురించి మాట్లాడుతూ.. ‘ మమ్మల్ని బలవంతంగా ఆ స్థలం నుంచి ఖాళీ చేయించారు. మా పొరిగింటి వాళ్లు కూడా స్థలం ఆక్రమించారు. వారిని మాత్రం ఏమీ అనలేదు. అది వివక్ష కాదా.. మా ఆయనకు కళ్లు సరిగా కనిపించవు’ అని అంది. ప్రస్తుతం దంపతుల సమాధికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇవి కూడా చదవండి

Outdoor Shoes: ఇంట్లోకి షూ వేసుకెళుతున్నారా.. అయితే, మీ ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే..

KL Rahul Cars: కేఎల్ రాహుల్ దగ్గర కోట్ల రూపాయల కార్లు

Updated Date - Apr 18 , 2025 | 12:46 PM