ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కూతురి కోసం తండ్రి సాహసం.. నడి సంద్రంలో ప్రాణాలకు తెగించి..

ABN, Publish Date - Jul 01 , 2025 | 12:30 PM

Viral Video: ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ తండ్రిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అత్నడి హీరో అంటూ పొగుడ్తున్నారు.

Viral Video

కన్న బిడ్డ కోసం ఓ తండ్రి తన ప్రాణాలకు తెగించాడు. ఓడ మీద నుంచి సముద్రంలో పడిపోయిన కూతురి కోసం సాహసం చేశాడు. సముద్రంలోకి దూకి మరీ కూతుర్ని రక్షించుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆదివారం డిస్నీ డ్రీమ్ అనే షిప్ బహమాస్‌ నుంచి సౌత్ ఫ్లోరీడా ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల ఓ పాప ఓడలోంచి నీటిలో పడిపోయింది. పక్కనే ఉన్న ఆమె తండ్రి.. పాప కిందపడిపోవటం చూశాడు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పాపను రక్షించడానికి సముద్రంలోకి దూకాడు. మునిగిపోతున్న పాపను రక్షించాడు. అయితే, ఓడ వేగంగా కొంతదూరం వెళ్లిపోయింది. తోటి ప్రయాణికులు గట్టిగా అరుస్తూ ఓడ సిబ్బందికి విషయం చెప్పారు. కెప్టెన్ ఓడను ఆపేశాడు. సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. బోటులో తండ్రీకూతురు ఉన్నచోటుకు వెళ్లారు. వారిని బోటులో ఎక్కించుకుని షిప్ దగ్గరకు తీసుకువచ్చారు. అదృష్టం కొద్దీ తండ్రీకూతురు ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ తండ్రిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. అత్నడి హీరో అంటూ పొగుడ్తున్నారు. ‘తండ్రి ప్రేమ అంటే ఇదే.. తన ప్రాణాలకు తెగించి మరీ కూతుర్ని కాపాడాడు’.. ‘వాళ్లిద్దరి అదృష్టం బాగుంది. షార్క్‌లు, తిమింగళాలు లేని చోట పడ్డారు. లేదంటే వాటికి ఆహారంగా మారేవారు’..‘కూతురి కోసం తన ప్రాణాలు రిస్క్‌లో పడేసుకున్నాడు. రియల్ హీరోకు సెల్యూట్’ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రోజుకో ఆపిల్.. నిజంగా మంచిదేనా..

ఆస్పత్రిలో దారుణం.. అందరూ చూస్తుండగా యువతిపై కూర్చుని..

Updated Date - Jul 01 , 2025 | 12:30 PM