Girl Fell from Rooftop: రీల్స్ పిచ్చి ప్రాణాల మీదకు తెచ్చింది.. ఈ అమ్మాయి పరిస్థితి ఏమైందో చూడండి..
ABN, Publish Date - Aug 13 , 2025 | 03:34 PM
చాలా మంది రీల్స్ కోసం ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు గాయపడి ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా ఓ యువతి రీల్ కోసం ఓ పిచ్చి ప్రయత్నం చేసి దారుణ ప్రమాదానికి గురైంది.
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే తపన చాలా మందికి పెరుగుతోంది. ముఖ్యంగా రీల్ (Reel) క్రేజ్ రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. ఆ క్రమంలో చాలా మంది రీల్స్ కోసం ప్రమాదకర సాహసాలు (Dangerous Stunts) చేస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు గాయపడి ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా ఓ యువతి రీల్ కోసం ఓ పిచ్చి ప్రయత్నం చేసి దారుణ ప్రమాదానికి గురైంది. ఆస్పత్రి పాలై చికిత్స తీసుకుంటోంది (Girl Fell from Rooftop).
ayush_actor6 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ యువతి తన ఇంటి డాబా మీదకు ఎక్కి రీల్ కోసం డ్యాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఆ డాబాకు పిట్టగోడ లేదు. దీంతో ఆ యువతి డ్యాన్స్ చేస్తూ డాబా చివరకు వెళ్లిపోయి కాలు జారి పై నుంచి కింద పడిపోయింది. ప్రమాదం తర్వాత, బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
హాస్పిటల్ బెడ్‌పై ఆ యువతి చికిత్స తీసుకుంటుండడాన్ని కూడా ఆ వీడియోలో చూపించారు. మరో రెండ్రోజులు చికిత్స చేసిన తర్వాతే ఆమె పరిస్థితి గురించి క్లారిటీ వస్తుందని డాక్టర్లు తెలిపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. దాదాపు నాలుగు లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి ఆ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్స్ పిచ్చిలో పడి ప్రజలు కామన్‌సెన్స్ కోల్పోతున్నారని చాలా మంది వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఈ గడ్డిలో పురుగు కనబడిందా.. మీ కళ్లకు ఇక తిరుగులేనట్టే..
పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 13 , 2025 | 03:34 PM