ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Snake Around Neck: 70 ఏళ్ల బామ్మ సాహసం.. పామును మెడకు చుట్టుకుని..

ABN, Publish Date - Jul 28 , 2025 | 05:25 PM

Snake Around Neck: డోరు వెనక దాక్కున్న పామును శకుంతల చేతుల్తో పట్టుకుని పక్కకు తీసింది. అక్కడి వారంతా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఆ పామును తన మెడకు కూడా చుట్టుకుంది.

Snake Around Neck

పాములంటే ఎవరికి మాత్రం భయం ఉండదు చెప్పండి. పాము కనిపించగానే.. మనకు తెలియకుండానే పరుగులు పెడతాం. అలాంటిది పామును చేతుల్తో పట్టుకుని మెడకు చుట్టుకోగలమా?.. ఆ ఆలోచనే భయంకరంగా ఉంది కదూ. కానీ, 70 ఏళ్ల ఓ బామ్మ మాత్రం దాదాపు 6 అడుగుల పామును ఎలాంటి భయం, బెరుకు లేకుండా చేత్తో పట్టుకుని, మెడకు చుట్టుకుంది. ఆ వృద్ధురాలు చేసిన పనికి కుటుంబసభ్యులతో పాటు పొరిగింటి వాళ్లు కూడా షాక్ అయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పుణె, ముల్సి తాలూకాలోని అంబోలీ గ్రామానికి చెందిన 70 ఏళ్ల శకుంతల సుతర్ ఇంటి ఆవరణలోకి ఓ పాము వచ్చింది. దీంతో ఇంట్లో వాళ్లంతా గట్టిగా కేకలు వేస్తూ అక్కడినుంచి పరుగులు తీశారు. ఇంట్లో వాళ్లను చూసి ఆ పాము భయపడింది. డోరు వెనక్కు వెళ్లి దాక్కుంది. పాము విషయం తెలిసి పొరిగిళ్ల వారు కూడా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో శకుంతల రంగంలోకి దిగింది. పాముకు ఏ మాత్రం భయపడకుండా డోరు దగ్గరకు వెళ్లింది.

డోరు వెనక దాక్కున్న పామును చేతుల్తో పట్టుకుని పక్కకు తీసింది. అక్కడి వారంతా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె ఆ పామును తన మెడకు కూడా చుట్టుకుంది. ఆ బామ్మ ఆ పామును పట్టుకోవటం, మెడకు చుట్టుకోవటం వెనుక ఓ మంచి కారణం ఉంది. ఆ పాము జెర్రిపోతు. జెర్రిపోతులు విషం లేని పాములు. ఎలుకల్ని తిని బతుకుతూ ఉంటాయి. విషం లేని ఆ పాముల్ని చంపకూడదని చెప్పడానికే ఆమె అలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు బామ్మపై ప్రశంసలు కురిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డాక్టర్ల నిర్లక్ష్యం.. పేషంట్ ప్రాణం పోతుందని తెలిసినా..

స్టార్ హీరో ఫ్యాన్స్‌పై హీరోయిన్ పోలీస్ కంప్లైంట్

Updated Date - Jul 28 , 2025 | 05:44 PM