Viral Video: స్కూటీపై వెళ్తున్న మహిళ.. వెనుక పిల్లాడిని గమనించిన బైకర్.. సమీపానికి వెళ్లి చూడగా..
ABN, Publish Date - Mar 07 , 2025 | 06:49 PM
ఓ మహిళ తన కొడుకును స్కూటీపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తోంది. అదే సమయంలో ఆమె వెనుకే వెళ్తున్న బైకర్‌కు.. స్కూటీపైన పిల్లాడిని చూడగానే అనుమానం కలిగింది. దీంతో సమీపానికి వెళ్లి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
తల్లి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తన పిల్లలను మాత్రం ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. అయితే అందరు తల్లులూ ఇలాగే ఉంటారనుకుంటే పొరపాటే. కొందరు తల్లి స్థానానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు తన పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తే.. ఇంకొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. స్కూటీపై వెళ్తున్న మహిళ వెనుక పిల్లాడిని చూసి ఓ బైకర్ ఫాలో అయ్యాడు. చివరికి ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన కొడుకును స్కూటీపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తోంది. అదే సమయంలో ఆమె వెనుకే వెళ్తున్న బైకర్‌కు.. స్కూటీపైన పిల్లాడిని చూడగానే అనుమానం కలిగింది. దీంతో సమీపానికి వెళ్లి చూడగా (child sleeping on scooter) పిల్లాడు నిద్రపోతూ కనిపించాడు. పిల్లాడిని చూసి షాకైన అతను.. ఆమెను పిలిచి విషయం తెలియజేశాడు. ‘‘మీ పిల్లాడు నిద్రపోతున్నాడు.. జాగ్రత్త’’.. అంటూ హెచ్చరించాడు.
అయితే ఆమెలో మాత్రం ఎలాంటి కంగారూ కనిపించలేదు. పైగా వినీ విననట్లు ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ.. స్కూటీని మరింత వేగంగా ముందుకు నడిపింది. కనీసం బండి ఆపి పిల్లాడు ఎలా ఉన్నాడని కూడా చూసుకోకుండా వెళ్లిపోయింది. పిల్లాడు నిద్రపోతున్నాడని చెప్పినా కూడా ఆమె పట్టించుకోకపోవడంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral Funny Video: రైలు గేటేసినా తగ్గేదేలే.. ఎలా దాటేశాడో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి తల్లి కూడా ఉంటుందా.. మరీ దారుణంగా వ్యవహరిస్తోంది కదా’’.. అంటూ కొందరు, ‘‘పిల్లలను ఇలా వెనుక కూర్చోబెట్టడం ప్రమాదకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 99 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వీళ్లు మనుషులేనా.. లారీ డ్రైవర్ మంటల్లో కాలుతున్నా.. ఏం చేస్తున్నారో చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..
Snake And Lion Video: సింహానికి చుక్కలు చూపించిన పాము.. ఉన్న చోటు నుంచే ఎలా భయపెట్టిందో చూస్తే..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Updated Date - Mar 07 , 2025 | 06:49 PM