Elon Musk: ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్‌కు షాక్.. ఆకాశంలో పేలిపోయిన రాకెట్..!
ABN, Publish Date - Jan 17 , 2025 | 11:52 AM
ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ తాజాగా నిర్వహించిన ప్రయోగం అనూహ్యంగా విఫలమైంది. స్పేస్‌ఎక్స్ కొత్త స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ ప్రయోగ సమయంలోనే పేలిపోయింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అంతరిక్ష నౌక ధ్వంసమైంది. ఈ పేలుడు వీడియోను ఎలన్ మస్క్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా షేర్ చేశారు.
ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ (SpaceX) సంస్థ తాజాగా నిర్వహించిన ప్రయోగం అనూహ్యంగా విఫలమైంది. స్పేస్‌ఎక్స్ కొత్త స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్ ప్రయోగ సమయంలోనే పేలిపోయింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే అంతరిక్ష నౌక ధ్వంసమైంది. ఈ పేలుడు వీడియోను ఎలన్ మస్క్ (Elon Musk) సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా షేర్ చేశారు. ``విజయం అస్థిరమైనది. కానీ, వినోదం మాత్రం గ్యారెంటీ`` అంటూ ఎలన్ మస్క్ తమ సంస్థ వైఫల్యంపై స్పందించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (SpaceX Starship explodes).
స్టార్ షిప్ రాకెట్ బూస్టర్‌ను ప్రయోగించిన 8 నిమిషాల వ్యవధిలోనే ఆరు ఇంజన్లు ఒక్కొక్కటిగా షట్ డౌన్ అయిపోయాయి. టెక్సాస్ నుంచి గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు అట్లాంటిక్ మీదుగా ఉన్న లూప్‌లో ఇంతకుముందు లాగానే ఈ ప్రయోగాన్ని కూడా నిర్వహించారు. అయితే అనూహ్యంగా ఇది విఫలమైంది. స్టార్ షిప్ రాకెట్ బూస్టర్ ఏడో దశ పరీక్షకు నిలువలేకపోయింది. రాకెట్ నుంచి బూస్టర్ నుంచి విడిపోయిన కాసేపటికే ఈ ఘోరం జరిగింది. అయితే రాకెట్ పేలిపోయినప్పటికీ బూస్టర్ మాత్రం క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చింది.
ఆక్సిజన్ లేదా ఇంధనం లీకేజీ కారణంగానే స్పేస్ ఎక్స్ రాకెట్ పేలిపోయి ఉండవచ్చని ఎలన్ మస్క్ ట్వీట్‌చేశారు. గత ఏడాది మార్చిలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ``మేము మొత్తం డేటాను పూర్తిగా విశ్లేషించాలి. ఏమి జరిగిందో ఖచ్చితంగా గుర్తించడానికి కొంత సమయం పడుతుంద``ని స్పేస్‌ఎక్స్ కమ్యూనికేషన్స్ మేనేజర్ డాన్ హుట్ పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయాణాన్ని స్థిరంగా అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ స్టార్ షిప్ పేలుడు వల్ల మియామీ ఎయిర్‌పోర్టులో 20 విమానాలు నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి..
Brain Teaser Test: మీ బ్రెయిన్‌కు సరైన సవాల్.. ఈ ఫొటోలో తప్పు ఏంటో 10 సెకెన్లలో కనిపెట్టండి..
Lottery: లాటరీలో రూ.80 కోట్లు.. అయినా స్వీపర్‌గానే పని చేస్తున్న వ్యక్తి.. ఎందుకని అడిగితే..
Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఈమె సముద్రంలో నీళ్లు ఎందుకు పడుతోందంటే..
Viral Video: ఓర్నీ.. బైక్ దొంగతనం ఇంత సులభమా? లాక్ చేసిన బైక్‌ను ఎలా తీసుకెళ్లాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jan 17 , 2025 | 11:52 AM