Viral Video: ఓర్నీ.. బైక్ దొంగతనం ఇంత సులభమా? లాక్ చేసిన బైక్‌ను ఎలా తీసుకెళ్లాడో చూడండి..
ABN , Publish Date - Jan 16 , 2025 | 07:20 PM
చోర కళలో ఆరితేరిన వారు చాలా సులభంగా దొంగతనాలు చేసేస్తుంటారు. ముఖ్యంగా బైక్‌లను దొంగిలించే వారు అద్భుతమైన టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి హ్యాండిల్ లాక్ చేసిన బైక్‌ను చాలా సులభంగా తీసుకెళ్లిపోయాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దొంగతనం (Theft) చేయడం అనేది ఒక కళ. దొంగతనం అనేది చెడ్డ పనే అయినప్పటికీ దానిని విజయవంతంగా చేయాలంటే ఎన్నో తెలివితేటలు కావాలి. గొప్ప టెక్నిక్‌లు తెలియాలి. అలాంటి చోర కళలో ఆరితేరిన వారు చాలా సులభంగా దొంగతనాలు చేసేస్తుంటారు. ముఖ్యంగా బైక్‌లను దొంగిలించే వారు (Thieves) అద్భుతమైన టెక్నిక్‌లు ఉపయోగిస్తుంటారు. బైక్ హ్యాండిల్స్‌ను కూడా లాక్ చేస్తారు కాబట్టి, బైక్ దొంగతనాలు కష్టమని అందరూ అనుకుంటారు (Bike Theft). అయితే తాజాగా ఓ వ్యక్తి హ్యాండిల్ లాక్ చేసిన బైక్‌ను చాలా సులభంగా తీసుకెళ్లిపోయాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@VishalMalvi అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన కొన్ని వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. అంతలో ఓ వ్యక్తి నేరుగా అక్కడికి వచ్చాడు. ఓ బైక్ దగ్గరకు వెళ్లి దాని మీద కూర్చున్నాడు. ఆ తర్వాత అతను బైక్ హ్యాండిల్‌పై తన కాలును పెట్టి, బలంగా తన్నాడు. దీంతో బైక్ హ్యాండిల్ అన్‌లాక్ అయిపోయింది. బైక్ స్టార్ట్ కాకపోవడంతో దానిని నడిపించుకుంటూ తోసుకుని వెళ్లిపోయాడు. ఆ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 13 వందల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ప్రస్తుతం ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారింది``, ``వామ్మో.. బైక్ దొంగతనం ఇంత సులభమా``, ``హ్యాండిల్ లాక్ చేసినా ఉపయోగం లేదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అక్కడ రెండు జంతువులు ఉన్నాయి.. ఏనుగుతో యువకుడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం..
Viral Video: మన దేశంలో ఏదైనా సాధ్యమే.. ఆ కొబ్బరి చెట్టును చూస్తే షాక్‌తో కళ్లు తేలెయ్యాల్సిందే..
Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..
Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి