Lottery: లాటరీలో రూ.80 కోట్లు.. అయినా స్వీపర్‌గానే పని చేస్తున్న వ్యక్తి.. ఎందుకని అడిగితే..
ABN , Publish Date - Jan 17 , 2025 | 09:41 AM
లక్ కలిసి వచ్చి లాటరీ తగిలితే రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోతుంది. వారి లైఫ్‌స్టైల్ ఉన్నట్టుండి మారిపోతుంది. బ్రిటన్‌కు కాలువలు క్లీన్ చేసే ఓ వ్యక్తికి తాజాగా ఏకంగా రూ.80 కోట్ల లాటరీ తగిలింది. అంత డబ్బు స్వంతమైన తర్వాత కూడా అతడు తన స్వీపర్ ఉద్యోగాన్ని మాత్రం వదలడం లేదు.

అదృష్టం (Luck) కలిసి వచ్చి లాటరీ తగిలితే జీవితం మారిపోతుందని చాలా మంది కలలు కంటుంటారు. ఎంతో ఆశతో ఏళ్ల తరబడి లాటరీ టిక్కెట్లు కొంటూనే ఉంటారు. లక్ కలిసి వచ్చి లాటరీ తగిలితే రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోతుంది. వారి లైఫ్‌స్టైల్ ఉన్నట్టుండి మారిపోతుంది. బ్రిటన్ (UK)కు కాలువలు క్లీన్ చేసే ఓ వ్యక్తికి తాజాగా ఏకంగా రూ.80 కోట్ల లాటరీ (Lottery) తగిలింది. అంత డబ్బు స్వంతమైన తర్వాత కూడా అతడు తన స్వీపర్ ఉద్యోగాన్ని మాత్రం వదలడం లేదు. అతడు తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది (Viral News).
బ్రిటన్‌లోని కార్లిస్లేకు చెందిన 20 ఏళ్ల జేమ్స్ క్లార్క్సన్ 7.5 మిలియన్ పౌండ్లు (రూ. 79.58 కోట్లు) లాట్టో జాక్‌పాట్‌ను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. లాటరీ అతడి భవిష్యత్తును మార్చేసింది. రాత్రికి రాత్రే మిలియనీర్‌గా మారినప్పటికీ, జేమ్స్ తన పనిని మానెయ్యాలనే ఉద్దేశంలో లేడు. పని చేస్తూనే ఉండాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు కోట్లకు ఓనర్ అయినా తన గ్రౌండ్ రియాలిటీని మరిచిపోకూడదనుకుంటున్నాడు. ``నా వయసు చాలా తక్కువ. ఇంకా 20 ఏళ్లే. డబ్బు వచ్చిందని ఇప్పుడు పని చేయడం మానెయ్యలేను. ఏ పనీ చేయకుండా ఉండలేను. నాకు తెలిసిన పని ఇదే`` అంటూ జేమ్స్ వ్యాఖ్యానించాడు.
``నేను ఆ రోజు నా గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో నిద్రపోయాను. ఉదయం 7:30 గంటలకు మెలకువ వచ్చినపుడు నేషనల్ లాటరీ యాప్ ద్వారా నాకు మెసేజ్ వచ్చింది. నేను 80 కోట్ల రూపాయలు గెలిచానని తెలిసింది. నాకు అప్పుడు నమ్మకం కుదరలేదు. పరుగు పరుగున నా ఇంటికి వెళ్లి నా తల్లిదండ్రులకు, సోదరుడికి ఆ మెసేజ్ చూపించాను. వారు నేషనల్ లాటరీకి ఫోన్ చేసినపుడు అది కన్ఫామ్ అని తేలింది. నా సంతోషానికి అవధులు లేవు. ఆ డబ్బును స్వీకరించి కొన్ని రోజులు నా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపాను. తర్వాత మళ్లీ పనికి వచ్చేశాన``ని జేమ్స్ చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఈమె సముద్రంలో నీళ్లు ఎందుకు పడుతోందంటే..
Viral Video: ఓర్నీ.. బైక్ దొంగతనం ఇంత సులభమా? లాక్ చేసిన బైక్‌ను ఎలా తీసుకెళ్లాడో చూడండి..
Viral Video: అక్కడ రెండు జంతువులు ఉన్నాయి.. ఏనుగుతో యువకుడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం..
Viral Video: మన దేశంలో ఏదైనా సాధ్యమే.. ఆ కొబ్బరి చెట్టును చూస్తే షాక్‌తో కళ్లు తేలెయ్యాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..