Viral Video: ఈ ఆంటీ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఈమె సముద్రంలో నీళ్లు ఎందుకు పడుతోందంటే..
ABN , Publish Date - Jan 17 , 2025 | 08:08 AM
పిల్లలే కాదు.. పెద్దలు కూడా సముద్రపు కెరటాలలో తడవడానికి ఇష్టపడతారు. చెప్పులను ఒడ్డు మీద వదిలేసి చాలా మంది నీటిలోకి వెళ్ళి ఆడుకుంటారు. అయితే తిరిగి ఇసుకలో నడిచి వచ్చి చెప్పులు వేసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది. తడి కాళ్లకు ఇసుక పూర్తిగా అంటుకుని చెప్పులు వేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది.

సాధారణంగా బీచ్ (Beach)కు వెళ్లి సముద్రపు నీటిలో ఆడుకోవడాన్ని చాలా మంది ఇష్టపడతారు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా సముద్రపు కెరటాలలో తడవడానికి ఇష్టపడతారు. చెప్పులను (Slippers) ఒడ్డు మీద వదిలేసి చాలా మంది నీటిలోకి వెళ్ళి ఆడుకుంటారు. అయితే తిరిగి ఇసుకలో (Sand) నడిచి వచ్చి చెప్పులు వేసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బంది. తడి కాళ్లకు ఇసుక పూర్తిగా అంటుకుని చెప్పులు వేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది. ఈ సమస్యకు ఓ మహిళ చాలా సులభమైన పరిష్కారం కనుగొంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@askshivanisahu అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ మహిళ బీచ్ ఒడ్డున చాలా సేపు చెప్పులు లేకుండా నడిచింది. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న కవర్ నిండా నీళ్లను పట్టుకుని తీసుకెళ్లింది. అనంతరం ఓ ప్లాస్టిక్ ట్రే మీద కూర్చుని తన కాళ్లను ఆ కవర్‌లో ముంచి వెంటనే చెప్పులు వేసుకుంది. ఇలా చేయడం వల్ల ఆమె కాలికి అంటుకున్న ఇసుక సులభంగా పోతుంది. ఆమె ట్రిక్ చూసిన పక్కనే ఉన్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 6.5 లక్షల మంది వీక్షించారు. 14 వందల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వావ్.. ఇది నిజంగా చాలా మంచి ఐడియా``, ``బీచ్‌కు ఎప్పుడు వెళ్లినా నాకు ఇదే పెద్ద సమస్య``, ``ఆమె తన బ్రెయిన్‌ను వంద శాతం వినియోగించింది``, ``నేను కూడా ఇకపై ఇదే ట్రిక్‌ను ఉపయోగిస్తా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఓర్నీ.. బైక్ దొంగతనం ఇంత సులభమా? లాక్ చేసిన బైక్‌ను ఎలా తీసుకెళ్లాడో చూడండి..
Viral Video: అక్కడ రెండు జంతువులు ఉన్నాయి.. ఏనుగుతో యువకుడి ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం..
Viral Video: మన దేశంలో ఏదైనా సాధ్యమే.. ఆ కొబ్బరి చెట్టును చూస్తే షాక్‌తో కళ్లు తేలెయ్యాల్సిందే..
Viral Video: మీరు సోయా చాప్స్‌ను ఇష్టంగా తింటారా? ఈ వీడియో చూస్తే ఇక వాటి జోలికి వెళ్లరేమో..
Optical Illusion Test: మీ కళ్ల పవర్ ఏ రేంజ్‌లో ఉంది?.. బొమ్మల మధ్యన నిజమైన గుడ్లగూబ ఎక్కడుంది..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి