ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Female HR: రెజ్యూమ్ పంపమంటే.. ప్రేమ పైత్యం చూపించిన పోకిరీలు

ABN, Publish Date - May 25 , 2025 | 05:09 PM

Female HR: రితికా అగ్నిహోత్రి అనే యువతి డిపెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం కోసం అప్లై చేసే వారి కోసం ఆమె వాట్సాప్ నెంబర్‌‌ను ఆన్‌లైన్‌లో పెట్టింది.

Female HR

ఉద్యోగానికి అప్లై చేస్తున్నాం అంటే రెజ్యూమ్ పంపాల్సిందే. ఆ రెజ్యూమ్‌తోటే మన సత్తా ఏంటో ఇంచుమించుగా తెలిసిపోతుంది. హెచ్‌ఆర్ వాళ్లకు మన రెజ్యూమ్‌ను బట్టే ఇంటర్వ్యూకు పిలవాలో లేదో అర్థం అయిపోతుంది. తాజాగా, కొంతమంది యువకులు ఓ లేడీ హెచ్‌ఆర్‌కు చుక్కలు చూపించారు. ప్రేమ పేరుతో ఆమెను టార్చర్ పెట్టారు. ఉద్యోగానికి రెజ్యూమ్ పంపాల్సింది పోయి.. ప్రేమ పాఠాలు మొదలెట్టారు. ఆమె వాట్సాప్‌కు ప్రేమ కవితలు పంపుతూ.. అందాన్ని పొగుడుతూ ఇబ్బంది పెట్టారు. ఇంతకీ సంగతేంటంటే..


రితికా అగ్నిహోత్రి అనే యువతి డిపెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం కోసం అప్లై చేసే వారి కోసం ఆమె వాట్సాప్ నెంబర్‌‌ను ఆన్‌లైన్‌లో పెట్టింది. అంతే.. ఇక అప్పటినుంచి ఆమెకు టార్చర్ మొదలైంది. ఉద్యోగం కోసం అప్లై చేసే వాళ్లకంటే.. ఆమెను ముగ్గులోకి దింపాలని ప్రయత్నించే వారే ఎక్కువై పోయారు. ఓ వ్యక్తి ఆమె వాట్సాప్ నెంబర్‌కు ప్రేమ లేఖలు పంపాడు. తనకు ఉద్యోగం వద్దని.. ఆమె ప్రేమ కావాలి అంటూ ముగ్గులోకి దింపే ప్రయత్నం చేశాడు.


మరో వ్యక్తి కూడా ఆమె అందాన్ని పొగిడాడు. అంతటితో ఆగకుండా.. అర్థరాత్రి కాల్స్ చేయటం మొదలెట్టాడు. ‘ మీరు ఎంత అందంగా ఉన్నారంటే.. మిమ్మల్ని చూసినప్పటినుంచి మర్చిపోలేకపోతున్నాను. ఏది నిజమో అదే చెప్పాను. కోపం తెచ్చుకోకండి. ఈ ప్రపంచంలో మీరే అత్యంత అందమైన అమ్మాయి’ అని పొగిడాడు. రోజు రోజుకు ఇలాంటి వాళ్ల టార్చర్ ఎక్కువైంది. దీంతో ఆమె తన లింక్డ్ఇన్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ‘ఆ పోస్టులో ఇలాంటి వాళ్లను ఎలా హ్యాండిల్ చేయాలి. సలహా ఇవ్వండి’ అని అడిగింది. వాళ్లు ఆమెతో చాట్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు పెట్టింది. అవి కాస్తా వైరల్ అయ్యాయి.


ఇవి కూడా చదవండి

FASTag New Policy: టోల్ పాస్.. కేంద్రం బంపరాఫర్. ఇక అన్ లిమిటెడ్ ఫ్రీ జర్నీ

Air Hostess: ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా ?

Updated Date - May 25 , 2025 | 06:31 PM