ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Raising a Child: ఒక్క బిడ్డను పెంచేందుకు ఏడాదికి రూ.13 లక్షల ఖర్చు.. నెట్టింట భారీ చర్చ

ABN, Publish Date - Jun 12 , 2025 | 08:04 PM

మెట్రో నగరాల్లో ఒక బిడ్డ ఆలనాపాలన ఖర్చు రూ.13 లక్షలు అంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పరిస్థితిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Mumbai child-raising cost,

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో బిడ్డల్ని పెంచేందుకు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో చెబుతూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అంకుర్ ఝావేరీ అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్‌గా చేస్తున్న తన బంధువుతో చర్చించాక పిల్లల పెంపకం ఖర్చు లెక్కించాలన్న ఆలోచన వచ్చిందన్నారు.

‘పిల్లల్ని పెంచేందుకు ఎంత ఖర్చు అవుతోంది అన్న ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఇటీవల నా కజిన్‌తో మాట్లాడాకే ఈ ఆలోచన వచ్చింది. ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫీజులు ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ ఉంటుంది. పుస్తకాలు, యూనిఫాం, ప్రైవేటు ట్యూషన్ వంటివన్నీ కలుపుకుంటే మరో రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు అదనంగా అవుతాయి. ఇక ఆటపాటలు, బర్త్‌డే పార్టీలు, కొత్త దుస్తులు వంటివన్నీ కలుపుకుంటే ఏడాదికి సుమారు రూ.13 లక్షల ఖర్చు వస్తుంది. ఈ లెక్కన హ్యాపీగా పిల్లల్ని పెంచుకోవాలంటే తల్లిదండ్రుల ఏడాది సంపాదన కనీసం రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షల మధ్య ఉండాలి. ఇక ఇద్దరు పిల్లలు ఉంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇంత ఖర్చు పెట్టినా ట్యూషన్ పెట్టాలంటే ఇక ఇంటర్నేషనల్ స్కూల్‌కు పంపించడంలో అర్థమేముందని ఓ వ్యక్తి ప్రశ్నించారు. ఇక పిల్లలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ఖర్చు మరింత పెరుగుతుందని అన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాలనుకుంటే మాత్రం ఇక చుక్కలు కనిపిస్తాయని మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి స్కూళ్లకు బదులు సీబీఎస్‌సీ ఐసీఎస్‌సీ స్కూళ్లు బెటరని, తల్లిదండ్రులకు ఇవి అందుబాటులో ఉంటాయని అన్నారు. తమ పిల్లలకు అన్నీ అందించాలన్న తల్లిదండ్రుల తపన చివరకు ఇలాంటి పరిణామాలకు దారి తీస్తోందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.

ఇవి కూడా చదవండి:

ఏసీ గది బుక్ చేయని వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు

ఇన్‌స్టాలో ఇద్దరు ఫాలోవర్లు తగ్గడంతో ఆగ్రహం.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు

Read Latest and Viral News

Updated Date - Jun 12 , 2025 | 08:17 PM