ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Milan Airport: వామ్మో.. ఎయిర్‌పోర్టులో చిన్న పిల్లలా కిందపడి డొల్లుతూ మహిళ గోల

ABN, Publish Date - Jun 12 , 2025 | 09:48 PM

లగేజీ బరువు ఎక్కువగా ఉన్నందుకు విమానంలోకి అనుమతించకపోవడంతో ఓ మహిళ నానా రభసా సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Milan airport meltdown

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌పోర్టులో ఓ మహిళ కింద పడి డొల్లుతూ నానా యాగీ చేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. ఇటలీలోని మిలాన్ మాల్పెన్సా ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగినట్టు తెలిసింది.

మీడియా కథనాల ప్రకారం, సదరు మహిళ హ్యాండ్ లగేజీ బరువు పరిమితికి మించి ఉండటంతో అధికారులు విమానంలోకి అనుమతించలేదు. అధిక బరువు కోసం అదనపు చార్జీలు చెల్లించాలని తేల్చి చెప్పారు. ఇది కుదరదనుకుంటే అదనపు లగేజీని చెకిన్ సూట్‌కేసులో పెట్టుకోవాలని స్పష్టం చేశారు. అయితే, హ్యాండ్ లగేజీ మొత్తాన్ని తన వెంట తీసుకెళతానని మారాం చేసిన మహిళ చిన్న పిల్లలా నానా హంగామా సృష్టించింది.

కిందపడి డొల్లుతూ, చేతులు కాళ్లను నేలకేసి విసురుతూ నానా రభసా సృష్టించింది. చుట్టూ ఉన్న వారు ఈ దృశ్యాలను చూసి షాకైపోయారు. ఇదేమీ పట్టించుకోని ఆమె తన మానాన తాను పెద్ద రాద్ధాంతం సృష్టించింది. ఎయిర్‌పోర్టు అధికారులపై నోరు పారేసుకుంది. అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో, వారు ఆమెను విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. ఆ తరువాత మహిళ సర్దుకున్నాక మరో విమానం టిక్కెట్టు బుక్ చేయించి పంపించారు.

ఇక ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇలా కిందపడి గోల చేస్తే అధికారులు వింటారనుకుంటే పొరపాటే అని కొందరు అన్నారు. అధికారులు ఇలాంటి నాటకాలకు లొంగరని మరికొందరు అన్నారు. ఇది చాలా దారుణమని తెలిపారు. ఇటీవల కాలంలో ప్యాసెంజర్లు ఎయిర్‌పోర్టుల్లో రాద్ధాంతం చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయని కూడా కొందరు కామెంట్ చేశారు. గతనెలలో చికాగో ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి కంప్యూటర్ మానిటర్‌ను సిబ్బందిపై విసిరిన వైనాన్ని గుర్తు చేశారు.

ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టు యంత్రాంగం పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఎయిర్‌పోర్టుల్లో భద్రతను పెంచడంతో పాటు నిబంధనల గురించి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సమాచారం అందేలా చూడటం, ఎయిర్‌పోర్టు సిబ్బందికి అన్ని వేళలా మద్దతుగా ఉండటం తదితర చర్యలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

లక్షలు ఆర్జిస్తున్న ఆటో డ్రైవర్ జీవితం తలకిందులు.. వీడియో వైరల్ కావడంతో షాక్

ఒక్క బిడ్డను పెంచేందుకు ఏడాదికి రూ.13 లక్షల ఖర్చు.. నెట్టింట భారీ చర్చ

Read Latest and Viral News

Updated Date - Jun 12 , 2025 | 09:49 PM