Viral Video: శ్మశానంలో అనుమానాస్పదంగా కారు.. దగ్గరికెళ్లి చూడగా..
ABN, Publish Date - Jul 12 , 2025 | 02:00 PM
Viral Video: గ్రామస్తులు ఆ కారును గమనించారు. చాలా సేపటినుంచి కారు అక్కడే ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే కారు దగ్గరకు వెళ్లారు. గ్రామస్తులను చూడగానే రాహుల్, ఆ మహిళ అలర్ట్ అయ్యారు.
ఓ రాజకీయ నాయకుడు పరాయి మహిళతో శ్మశానంలో తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఊరి జనానికి చిక్కి పరువు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బులందర్‌షహార్ జిల్లాకు చెందిన రాహుల్ బాల్‌మీకి పరాయి మహిళతో తన కారులో కైలావాన్ గ్రామ శివారులోని శ్మశానంలోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరూ కారులో తప్పు చేయటం మొదలెట్టారు.
ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు ఆ కారును గమనించారు. చాలా సేపటినుంచి కారు అక్కడే ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. వెంటనే కారు దగ్గరకు వెళ్లారు. గ్రామస్తులను చూడగానే రాహుల్, ఆ మహిళ అలర్ట్ అయ్యారు. అక్కడినుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వారిని అక్కడినుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. రాహుల్ గ్రామస్తుల కాళ్లు పట్టుకుని మరీ బతిమాలాడు. అయినా వాళ్లు వినలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఛీ.. ఇలాంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీసులకు అప్పగించాలి‘..‘ మీకు తప్పు పనులు చేయడానికి వేరే ఏ చోటూ దొరకలేదా?.. ఏకంగా శ్మశానంలోకి దూరారు’.. ‘మీరు మనుషులా.. పశువులా శ్మశానంలో అలా చేయటం తప్పని పించటంలేదా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. రాహుల్ పని చేస్తున్న పార్టీ కూడా స్పందించలేదు.
ఇవి కూడా చదవండి
గొప్ప మనసు.. తోటి నటి హుమైరా అంత్యక్రియల చేస్తానంటూ..
ఫోన్ దొంగతనం.. కట్ చేస్తే భార్య ఎఫైర్ బయటపడింది..
Updated Date - Jul 12 , 2025 | 02:00 PM