Viral Vide: ఓసీ పిల్ల నక్కా.. సింహంతో ఆటలా..
ABN, Publish Date - May 04 , 2025 | 08:33 PM
Viral Vide: తోకను కొరికింది ఎవరా అన్నట్లు చూసింది. ఎదురుగా ఓ నక్క పిల్ల కనిపించింది. ఆ సింహం దాన్ని చూసి కూడా ఏమీ అనలేదు. తోక ఊపుతూ నిద్రపోవటానికి ఉపక్రమించింది. ఆ తుంటరి నక్క పిల్ల మళ్లీ సింహం దగ్గరకు వచ్చింది.
‘పడుకుంది కదా అని.. సింహం జూలుతో జడ వేయకూడదురో’ అని సినిమా డైలాగ్ ఉంటుంది. పడుకుని ఉన్నా.. నిద్రపోతూ ఉన్నా.. సింహంతో పెట్టుకోవటం ప్రమాదం అని ఆ డైలాగ్ ఉద్దేశ్యం. అడవికి రాజు సింహంతో పెట్టుకోవాలంటే ఏ జంతువు గుండెల్లోనైనా దడ పుడుతుంది. ఆఖరికి బెంగాల్ టైగర్ కూడా సింహం జోలికి పోవడానికి ఆలోచిస్తుంది. అలాంటిది ఓ నక్క పిల్ల ప్రాణాలకు తెగించింది. సింహంతో ఆటలు ఆడింది. పడుకున్న సింహం తోక కొరుకుతూ గమ్మత్తు చేసింది. సింహం మూడు బాగుంది కాబట్టి బతికి బయటపడింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఓ సింహం వెల్లకిలా పడుకుని అటు, ఇటు నుసులుతూ ఉంది. సింహం తోక దగ్గర ఉన్న ఓ నక్క పిల్ల తోకను గట్టిగా కొరికి అక్కడినుంచి పక్కకు పరిగెత్తింది. పాపం సింహం ఉలిక్కి పడి లేచింది. తోకను కొరికింది ఎవరా అన్నట్లు చూసింది. ఎదురుగా ఓ నక్క పిల్ల కనిపించింది. ఆ సింహం దాన్ని చూసి కూడా ఏమీ అనలేదు. తోక ఊపుతూ నిద్రపోవటానికి ఉపక్రమించింది. ఆ తుంటరి నక్క పిల్ల మళ్లీ సింహం దగ్గరకు వచ్చింది.
మళ్లీ తోకను కొరికి అక్కడినుంచి దూరంగా పారిపోయింది. సింహం మళ్లీ ఉలిక్కిపడి లేచింది. పరుగులు తీస్తున్న నక్క పిల్ల వైపు చూసింది. వీడియోలో అంత వరకు మాత్రమే రికార్డు అయింది. తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇక, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ నక్క పిల్లకు ప్రాణం మీద ఆశలేనట్లు ఉంది. అందుకే సింహంతో పెట్టుకుంటోంది’..‘ ఫ్రెండ్స్ అండ చూసుకుని ఆ నక్క పిల్ల సింహంతో పెట్టుకుంటోంది’.. ‘ పిల్ల నక్కకు సరదాలు ఎక్కువయ్యాయి. ప్రాణాలు పోతాయని తెలీదు పాపం’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Nani Head Injury: నాని తలకు గాయం.. అయినా షూటింగ్ ఆపలేదు..
Ramayana Record: 38 ఏళ్లయినా క్రేజ్ ఏ మాత్రం తక్కలేదు..
Updated Date - May 04 , 2025 | 08:33 PM