Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్‌కు సీరియస్.. వెంటిలేటర్‌పై చికిత్స
ABN, Publish Date - Jul 02 , 2025 | 01:06 PM
Fish Venkat: ఫిష్ వెంకట్ ‘సమ్మక్క సారక్క’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఖుషీ, ఆది, దిల్, బన్నీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గతంలో డయాలసిస్ చేయించుకున్నారు. దీంతో ఆరోగ్యం కొంత మెరుగుపడింది. అయితే, అంతా బాగుంది అనుకునే లోపు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఆయన ఆపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. మనుషుల్ని గుర్తించలేకుండా ఉన్నారని కుటుంసభ్యులు చెబుతున్నారు. ఫిష్ వెంకట్‌కు కిడ్నీ మారిస్తే తప్ప లాభం లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. అసలే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ఆయన కుటుంబానికి కిడ్నీ మార్పించటం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని నటుడి కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. గతంలో ఫిష్ వెంకట్ ఆస్పత్రి పాలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సాయం చేశారు. చికిత్స కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చారు.
పాతికేళ్లుగా చిత్ర పరిశ్రమలో..
ఇంటర్‌నెట్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఫిష్ వెంకట్ ‘సమ్మక్క సారక్క’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఖుషీ, ఆది, దిల్, బన్నీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కనిపించారు. అనారోగ్యం కారణంతో సినిమాలు తగ్గించేశారు. అవకాశాలు వస్తున్నా.. సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
యూఎస్ బీ2 బాంబర్లు ఎక్కడ.. ఇరాన్‌పై దాడి తర్వాత ఏమయ్యాయి..
సినిమాను తలపించే బ్యాంకు దోపిడి.. చిన్న తప్పుతో..
Updated Date - Jul 02 , 2025 | 02:05 PM