ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistani reporter in Flood: వార్నీ.. ఇదెక్కడి రిపోర్టింగ్.. వరద నీటిలో పాక్ రిపోర్టర్ ఓవరాక్షన్ చూడండి..

ABN, Publish Date - Jul 19 , 2025 | 10:24 AM

ప్రస్తుత డిజటల్ యుగంలో కొందరు రిపోర్టర్లు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. అనవసర సమయంలో కూడా సాహసాలు చూస్తే విమర్శలకు గురవుతున్నారు. తాజాగా ఓ పాకిస్థాన్ రిపోర్టర్ వరద నీటిలో నిలబడి చేసిన రిపోర్టింగ్ అతడికి ఇబ్బందులు కలిగించింది.

Pakistani reporter is swept away by strong currents

మీడియా రిపోర్టర్లు అప్పుడప్పుడు తమ విధి నిర్వహణలో భాగంగా ధైర్య సాహసాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ప్రాణాలకు సైతం తెగించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత డిజటల్ యుగంలో కొందరు రిపోర్టర్లు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. అనవసర సమయంలో కూడా సాహసాలు చేస్తూ విమర్శలకు గురవుతున్నారు. తాజాగా ఓ పాకిస్థాన్ రిపోర్టర్ (Pakistani reporter) వరద నీటిలో (Flood Water) నిలబడి చేసిన రిపోర్టింగ్ అతడికి ఇబ్బందులు కలిగించింది (Viral Video).

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదల కారణంగా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి వరద పరిస్థితిని బయటి ప్రపంచానికి తెలియజేయడం కోసం ఓ రిపోర్టర్ అక్కడకు వెళ్లాడు. వరద నీటిలో నిలబడి అతడు రిపోర్టింగ్ చేస్తున్న వీడియోను 'అల్ అరేబియా ఇంగ్లీష్' ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆ రిపోర్టర్ పరిస్థితి చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. పీకల్లోతు నీటిలో మునిగిపోయి కూడా అతడు రిపోర్టింగ్ చేస్తున్నాడు.

అతడు రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో వరద నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఆ వరద ధాటికి అతడు కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు జర్నలిస్ట్‌పై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఇంత ఓవరాక్షన్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. రిపోర్టింగ్ చేయడం తప్పేం కాదని, అయితే ప్రాణాలను పణంగా పెట్టి ఇలా చేయాల్సిన అవసరం లేదని కొందరు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

మెడలో పామును పెట్టుకుని బైక్ డ్రైవింగ్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

మీ చూపు షార్ప్ అయితే.. ఈ అడవిలో కప్ కేక్ ఎక్కడుందో 10 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 19 , 2025 | 10:24 AM