ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో టీ కెటిల్‌ను ఎలా కడుగుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..

ABN, Publish Date - Jun 24 , 2025 | 05:16 PM

రైలు ప్రయాణంలో చాలా మంది లోపల అమ్మే టీ, కాఫీలు తాగుతుంటారు. తినుబండాలను తింటుంటారు. అయితే కొందరు మాత్రం వాటి జోలికే వెళ్లరు. రైలులో అమ్మే ఏ ఆహార పదార్థం అయినా చాలా అపరిశుభ్రంగా, నాసిరకంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.

washing tea kettle in a train toilet

రైలు (Train) ప్రయాణంలో చాలా మంది లోపల అమ్మే టీ, కాఫీలు తాగుతుంటారు. తినుబండాలను తింటుంటారు. అయితే కొందరు మాత్రం వాటి జోలికే వెళ్లరు. రైలులో అమ్మే ఏ ఆహార పదార్థం అయినా చాలా అపరిశుభ్రంగా, నాసిరకంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. వీరి అనుమానాలను నిజం చేసే వీడియోలు ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వచ్చాయి. తాజాగా మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ట్రైన్‌లో టీ (Tea in Train) తాగాలంటే భయపడతారు.

@BhanuNand అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కదులుతున్న రైలు టాయిలెట్‌లో టీ అమ్మే వ్యక్తి ఉన్నాడు. టీ తయారు చేసే కెటిల్‌‌ను ఆ టాయిలెట్‌ ట్యాప్‌లో వచ్చే నీటితో అక్కడే కూర్చుని శుభ్రం చేస్తున్నాడు. ఈ దృశ్యం చాలా అసహ్యంగా ఉంది. ఎవరైనా ఆ వీడియోను చూస్తే రైలులో టీ తాగాలనే కోరికను తప్పకుండా చంపుకుంటారు. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. మీరు రైలులో టీ తాగాలనుకుంటే, ఈ వీడియో మీ కోసమే అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది వీక్షించారు. 2.9 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఇక నుంచి, రైలులో టీ తాగే ముందు నేను పదిసార్లు ఆలోచిస్తాను అని ఒకరు కామెంట్ చేశారు. ఇది ప్రయాణికుల ఆరోగ్యాలతో ఆడుకోవడం అంటూ మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైళ్లలో క్యాటరింగ్ సేవల నాణ్యతను పర్యవేక్షించడం కోసం రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని మరో వ్యక్తి కోరారు.

ఇవి కూడా చదవండి..

మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో తప్పేంటో 7 సెకెన్లలో కనిపెట్టండి

షాకింగ్.. 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రష్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 24 , 2025 | 05:16 PM