Viral Video: పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఇదే.. రీల్స్ కోసం ఎలాంటి సాహసం చేశారో చూడండి..
ABN, Publish Date - Aug 09 , 2025 | 01:50 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కామన్‌సెన్స్ కోల్పోతున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఆడా, మగా అనే తేడా లేకుండా ప్రమాదాలతో ఆటలాడుకుంటున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది కామన్‌సెన్స్ కోల్పోతున్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఆ క్రమంలో ప్రమాదకర విన్యాసాలు (Dangerous Stunts) చేస్తున్నారు. ఆడా, మగా అనే తేడా లేకుండా ప్రమాదాలతో ఆటలాడుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.
ఒక జంట (Lovers) రీల్ పిచ్చిలో పడి ఎవరూ ఊహించని పనిచేసింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. @imnatasha09 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియో (Viral Video)ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ఓ జంట వేగంగా నీరు ప్రవహిస్తున్న కాలువపై ఉన్న బ్రిడ్జ్ మీద నిల్చుని ఉంది. చుట్టూ అందరూ చూస్తుండగా వారిద్దరూ కౌగిలించుకుని నిల్చున్నారు. కాసేపటికి వారిద్దరూ కలిసి ఆ నీటిలోకి దూకేశారు. వారి స్టంట్‌ను చుట్టూ ఉన్న వారు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ప్రాణం కంటే రీల్స్ ముఖ్యం అని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి పిచ్చివాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా చట్టాలను రూపొందించాలని మరొకరు పేర్కొన్నారు. రీల్స్ వ్యసనం నుంచి బయటపడడం అంత తేలిక కాదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..
ఈ మంచులో కుక్క ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు తిరుగులేదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 09 , 2025 | 02:44 PM