150 Liquor Bottles: ఇలా కూడా స్మగ్లింగ్ చేస్తారా?.. ఏసీ కోచ్‌లో 150 మందు బాటిళ్లు..
ABN, Publish Date - Aug 14 , 2025 | 12:29 PM
150 Liquor Bottles: బుద్వాల్ దగ్గర ఏసీ టెక్నీషియన్ వచ్చాడు. విపిన్ కూర్చున్న చోట సీలింగ్ విప్పాడు. లోపలికి దూరి చూసి షాక్ అయ్యాడు. లోపల మొత్తం చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి.
పుష్ప సినిమాలో హీరో పుష్ప రాజ్ ఎర్ర చందనం దుంగల్ని స్మగ్లింగ్ చేయడానికి కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. పోలీసులకు కూడా దొరకకుండా సేఫ్‌గా ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. సినిమాలను చూసి స్మగ్లరు స్పూర్తి పొందుతున్నారో.. లేక సినిమాలే రియల్ లైఫ్ స్మగ్లర్లను చూసి స్పూర్తి పొందుతున్నాయే తెలీదు కానీ.. దొంగలు బాగా తెలివి మీరి పోయారు. ఇందుకు ఈ తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రైలులోని ఏసీ కోచ్‌లో ఏకంగా 150 మందు సీసాలు బయటపడ్డాయి.
అవి ఎక్కడ దొరికాయో తెలిస్తే మీరు అవాక్ అవుతారు. స్మగ్లర్లు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. ఆ మందు సీసాలను ఏసీ బిగించి ఉండే సీలింగ్‌లో దాచి ఉంచారు. అనుకోని విధంగా ఆ మందు సీసాలు పోలీసులకు దొరికి పోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం విపిన్ కుమార్ అనే వ్యక్తి లక్నో నుంచి బరౌనీ వెళుతున్న ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నాడు. ఏసీ నుంచి సరిగా గాలి రాకపోవటంతో అతడికి చిరాకు వచ్చింది.
వెంటనే రైల్వే అధికారులకు కంప్లైంట్ చేశాడు. బుద్వాల్ దగ్గర ఏసీ టెక్నీషియన్ వచ్చాడు. విపిన్ కూర్చున్న చోట సీలింగ్ విప్పాడు. లోపలికి దూరి చూసి షాక్ అయ్యాడు. లోపల మొత్తం చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి. అతడు ఓ దాన్ని తీసి లోపల ఏమున్నాయో చెక్ చేశాడు. అందులో మందు బాటిళ్లు బయటపడ్డాయి. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు అక్కడికి వచ్చారు. ఏసీ టెక్నీషియన్‌తోటే వాటిని బయటకు తీయించారు. దాదాపు 150 బాటిళ్లు బయటపడ్డాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు ఈ నగరాల్లో మద్యం షాపుల బంద్
కూతుర్ని చంపి సూసైడ్ డ్రామా.. ఆమె ప్రియుడి ఎంట్రీతో..
Updated Date - Aug 14 , 2025 | 12:47 PM