ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Vembu: పెరుగుతున్న పసిడి ధరలు.. రాబోయే ముప్పనకు హెచ్చరికా?

ABN, Publish Date - Oct 18 , 2025 | 10:11 PM

బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నందుకు ఇన్వెస్టర్లు సంతోషించాలా? లేక రాబోయే ముప్పునకు ఇది సంకేతమా? ఈ విషయంపై జోహో సంస్థ అధినేత శ్రీధర్ వెంబు స్పందించారు.

1/8

నానాటికీ పెరుగుతున్న బంగారం ధరలపై జోహో కార్పొరేషన్ అధిపతి శ్రీధర్ వెంబు స్పందించారు. రాబోయే ముప్పునకు ఈ పరిణామం సంకేతం కావొచ్చని హెచ్చరించారు.

2/8

తన దృష్టిలో బంగారం అంటే పెట్టుబడి సాధనం కాదని, ఆర్థికవ్యవస్థలో వ్యవస్థాగత ముప్పును ఎదుర్కొనే బీమా అని కామెంట్ చేశారు.

3/8

అమెరికా స్టాక్ మార్కెట్‌లోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్న పెట్టుబుడులు అస్థిర పరిస్థితులకు దారి తీస్తున్నాయన్న ఆర్థికవేత్త డా. గీత గోపీనాథ్ అభిప్రాయంతో శ్రీధర్ వెంబు ఏకీభవించారు.

4/8

అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారీగా పోగైన అప్పులు, రుణ ఆధారిత పెట్టుబడులు చివరకు 2008 నాటి ఆర్థిక సంక్షోభం తరహా ముప్పును తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.

5/8

ఆర్థిక వ్యవస్థకు పునాది నమ్మకమేనని శ్రీధర్ వెంబు అన్నారు. వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లినప్పుడే బంగారంపై పెట్టుబడులు పెరిగి ధరలకు రెక్కలొస్తాయని చెప్పారు.

6/8

బంగారం ధరల్లో పెరుగుదల మార్కెట్‌పై, రాబడులపై అపనమ్మకాన్ని సూచిస్తున్నాయని అన్నారు. ఇది ఆశావాహదృక్పథానికి సంకేతం ఎంతమాత్రం కాదని చెప్పారు.

7/8

ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏఐ కూడా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందేమో అని సెటైర్ కూడా వేశారు.

8/8

ఆర్థికవేత్తలు అనేక మంది దాదాపు ఇదే తరహా హెచ్చరికలు చేస్తున్నారు. ఇన్వెస్టర్లు జాగరూకతతో వ్యవహరించాలని మరీ మరీ చెబుతున్నారు.

Updated Date - Oct 18 , 2025 | 10:16 PM