Meaning of Dreams: కలలు.. వాటి వెనకున్న అంతరార్థం ఏంటో తెలుసా
ABN, Publish Date - Nov 03 , 2025 | 10:43 PM
రాత్రిళ్లు అనేక మందికి కలలు వస్తుంటాయి. ఈ కలలు మానసిక స్థితికి సంకేతాలని నిపుణులు చెబుతున్నారు.
అగాధంలోకి పడిపోతున్నట్టు కల వస్తే జీవితంలో విఫలమవుతున్నామని లేదా నిలదొక్కుకోలేక పోతున్నామనే భయం వెంటాడుతోందని అర్థం
పన్ను ఊడి కింద పడిపోయినట్టు కల వస్తే నమ్మకం లేదా, శక్తిని కోల్పోతున్నామని అర్థం. ఆత్మ విశ్వాస లేమికి ఈ కల ఓ సంకేతం
ఎవరో వెంటాడుతున్నట్టు కొందరికి కలలు వస్తుంటాయి. ఎవరినైనా, లేదా దేన్నైనా వదిలించుకోవాలన్న కోరిక బలంగా ఉంటే ఈ కల వచ్చే అవకాశం ఉంది
జీవితంలో సవాళ్లకు ఎదురు నిలవలేని వారిలో కొందరికి పరీక్షలకు సన్నద్ధంగా లేనట్టు కల వస్తుందని నిపుణులు చెబుతుంటారు.
గాల్లో ఎగురుతున్నట్టు కొందరికి కల వస్తుంది. మనసు స్వేచ్ఛను కోరుకుంటోందని, బంధనాలను తెంచుకునేందుకు ప్రయత్నిస్తోందనేందుకు ఈ కల సంకేతం
పాడుబడ్డ ఇల్లు కలలో కనిపిస్తోందంటే మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. కొత్త ఇల్లు కలలోకి వస్తే మీపై మీకు శ్రద్ధ ఎక్కువనే అర్థం ఉందని నిపుణులు చెబుతారు.
నిశ్చలమైన నీరు కలలోకి వస్తే మీ జీవితం, మనసు ప్రశాంతంగా ఉందని అర్థం. మనసు కల్లోలంగా ఉన్న వారికి తుఫాన్లు, ఉప్పొంగే నీరు కలల్లో కనిపిస్తాయి.
ఏదో బోనులో చిక్కుకుని ఉన్నట్టు కల వస్తే మీ జీవితానికి దిశానిర్దేశం లేకుండా ఇబ్బంది పడుతున్నారని అర్థం.
Updated Date - Nov 03 , 2025 | 10:46 PM