Saffron Milk Benefits: కుంకుమ పువ్వు వేసిన పాలు తాగితే కలిగే బెనిఫిట్స్
ABN, Publish Date - Oct 27 , 2025 | 10:25 PM
ఎన్నో ప్రయోజనాలు ఉన్న కుంకుమ పువ్వు, పాలు కలిపి తాగితే బెనిఫిట్స్ ఇనుమడిస్తాయి
కుంకుమ పువ్వులోని క్రొసిన్, సఫ్రానాల్ అనే యాంటీఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
కుంకుమ పువ్వు వేసిన పాలు తాగితే మూడ్ మెరుగై ఆందోళన, ఒత్తిడి నుంచి సాంత్వన లభిస్తుంది.
ఈ పాలతో జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. కడుపుబ్బరం వంటివి తగ్గుతాయి. విందు భోజనం తరువాత దీన్ని తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది.
కుంకుమ పువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి నిగారింపు చేకూరుస్తాయి. నల్లని మచ్చలు, చారలు తొలగిపోతాయి. మృదుత్వం పెరుగుతుంది.
కాల్షియం అధికంగా ఉండే పాలకు కుంకుమ పువ్వు జోడించడం వల్ల ఎముకలు మరింత దృఢంగా మారతాయి. చిన్నారులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
కుంకుమపువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
ఇందులోని పొటాషియం, క్రొసెటిన్ అనే రసాయనం బీపీని నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యం మెరుగయ్యేలా చేస్తాయి.
కుంకుమ పువ్వుతో మెదడుకు కూడా మేలు కలుగుతుంది. మేధోశక్తి పెరుగుతుంది. ఎదిగే చిన్నారులు దీన్ని తాగడం మరింత అవసరం
Updated Date - Oct 27 , 2025 | 10:30 PM