Japanese Longevity: జపాన్ ప్రజల దీర్ఘాయుష్షుకు ప్రధాన కారణాలు
ABN, Publish Date - Nov 07 , 2025 | 11:04 PM
జపాన్ ప్రజల ఆయురారోగ్యాలకు ప్రధాన కారణాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం
జపాన్ ప్రజలు ఎక్కడికైనా వెళ్లేందుకు సాధారణంగా సైకిల్ ఎక్కువగా వాడతారు. లేదా నడుస్తారు.
చేపలు, అన్నం, కూరగాయలు, సముద్రపు నాచు, పులియబెట్టిన ఫుడ్స్ వంటి సంప్రదాయక ఆహారాలనే ఎక్కువగా తింటారు.
సమర్థవంతమైన జపాన్ ప్రజారోగ్య వ్యవస్థ కూడా అక్కడి ప్రజల ఆయురారోగ్యాలకు కారణం
కెరీర్, వృత్తి మధ్య సమతౌల్యత కోసం క్రమశిక్షణ, వాస్తవంలో జీవించడం వంటివి కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడతాయి
కడుపు 80 శాతం మాత్రమే నిండేలా తినాలని చెప్పే ‘హర హచీ బూ’ విధానాన్ని అక్కడి వారు ఎక్కువగా ఫాలో అవుతారు.
బలమైన కుటుంబ, సామాజిక సంబంధాలు కూడా వారిలో ఆనందాన్ని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి.
ఇలా అనేక కారణాలు కలగలిసి జపాన్ ప్రజల జీవితాలను సుసంపన్నం చేస్తున్నాయనేది నిపుణులు అభిప్రాయం.
Updated Date - Nov 07 , 2025 | 11:08 PM