Health Benefits of Banana Leaves: అరటి ఆకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
ABN, Publish Date - Oct 06 , 2025 | 04:38 PM
అరటి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా..
అరటి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
అరటి ఆకులలోని పాలీఫెనాల్స్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం జీర్ణం కావడానికి, పోషకాలను గ్రహించడానికి సహాయపడతాయి.
అరటి ఆకులు చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, చర్మ సమస్యల నుండి రక్షిస్తాయి.
అరటి ఆకులను ఉడకబెట్టి తయారుచేసే టీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఆహారానికి సహజమైన రుచి వస్తుంది. ఆకులోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఆహారాన్ని శుభ్రపరుస్తాయి.
Updated Date - Oct 06 , 2025 | 04:38 PM