Dusshera Holidays: దసరాల సెలవులు వచ్చేశాయ్.. ఊళ్లకు వెళ్తున్న విద్యార్థులు..
ABN, Publish Date - Sep 20 , 2025 | 06:35 PM
తెలంగాణలో దసరా సెలవులు వచ్చేశాయ్. దీంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు తమ తమ ఊళ్లకు బయలుదేరుతున్నారు.
దసరా సెలవు వచ్చేశాయ్. అధికారికంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు స్కూ్ళ్లకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
21వ తేదీ నుంచి సెలవులు కావడంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు తమ తమ ప్రాంతాలకు బయలుదేరారు.
సెలవుల నేపథ్యంలో విద్యార్థులంతా బస్టాండ్లకు క్యూ కట్టారు. దీంతో బస్ స్టేషన్‌లన్నీ సందడిగా మారాయి.
వనపర్తి జిల్లా కేంద్రంలో దసరా సెలవులు రావడంతో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు వారి వారి సొంత గ్రామాలకు తరలివెళుతున్నారు.
విద్యార్థులు తల్లిదండ్రులు బంధుమిత్రులతో కలిసి ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి సొంత గ్రామాలకు వెళుతున్నారు.
దసరా సెలవుల నేపథ్యంలో హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులను తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్తున్నారు.
గ్రామాలకు వెళ్లేందుకు రోడ్డుపై వాహనాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు.
Updated Date - Sep 20 , 2025 | 06:35 PM