సంక్రాంతి వేళ భారీగా ప్రయాణికుల రద్దీ..!
ABN, Publish Date - Jan 11 , 2025 | 05:02 PM
హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు బయల్దేరారు. దీంతో రహదారులపై ట్రాఫిక్ నెలకొంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులు రావడంతో హైదరాబాద్ ప్రజలు పల్లెలకు బయలుదేరారు
సొంత వాహనాలు ఉన్న వారు నిన్నటి నుంచే సొంతూళ్లకు పయనమయ్యారు
మరోవైపు బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది
సొంతూళ్లకు వెళ్లే వారితో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లు కళకళలాడుతున్నాయి
టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోనుంది
ఫాస్టాగ్ విధానం అమలవుతుండటంతో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా త్వరగానే టోల్ ప్లాజా దాటిపోతున్నారు
అన్ని టోల్‌ప్లాజాల పంతంగి టోల్‌గేట్ వద్దనే రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో 16 టోల్ చెల్లింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు
గతేడాది సంక్రాంతి సమయంలో పంతంగి టోల్ ప్లాజా నుంచి రోజుకు 60 వేల వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ సారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది
Updated Date - Jan 11 , 2025 | 05:26 PM