హైదరాబాద్ నగరంలో నేడు, రేపు భారీ వర్షాలు
ABN, Publish Date - Sep 26 , 2025 | 01:57 PM
హైదరాబాద్ మహా నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సిటీ వ్యాప్తంగా 48 గంటల పాటు వర్ష బీభత్సం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం నుంచి వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో జన జీవనం అస్తవ్యస్తం అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
నేడు, రేపు హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు.
నగరంలో వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్స్ హై అలర్ట్‌లో ఉండాలని ఆదేశించారు.
అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రజల్ని హెచ్చరించారు.
వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఆఫీస్‌లు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లే వారికి ఇబ్బందిగా మారింది.
Updated Date - Sep 26 , 2025 | 01:57 PM