Flood Hits MGBS: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో ఎమ్‌జీబీఎస్..
ABN, Publish Date - Sep 27 , 2025 | 11:16 AM
తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇక, హైదరాబాద్ మహా నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది.
గత రెండు రోజులుగా హైదరాబాద్ మహా నగరంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
30 ఏళ్లలో తొలిసారి మూసీలోకి 38,50 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది.
చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు వరదలో మునిగిపోయాయి. చేతికందిన వస్తువులను పట్టుకుని కట్టుబట్టలతో జనం ఇళ్లలోంచి రోడ్డుమీదికొచ్చారు.
మూసీ ఉధృతికి నది ఒడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్‌లోకి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది.
వందల మంది ప్రయాణికులు బస్టాండ్‌లోనే చిక్కుకుపోయారు. గంటల పాటు భయం గుప్పిట్లో అల్లాడిపోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే ప్రయాణికులను బయటకు తీసుకురావాలని పోలీసు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.
అధికారులు బస్‌స్టాండ్‌లో రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. బయటి నుంచే ఆయా రూట్లల్లో బస్సులు ఆగిపోయాయి.
అధికారులు బస్‌స్టాండ్‌లో రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. బయటి నుంచే ఆయా రూట్లల్లో బస్సులు ఆగిపోయాయి. అధికారులు ఇప్పటికే బస్ స్టాండ్‌లో ఉన్న అన్ని బస్సులను బయటకు తరలించారు.
Updated Date - Sep 27 , 2025 | 11:18 AM