Yadagirigutta Giri Procession: యాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
ABN, Publish Date - Sep 25 , 2025 | 09:50 AM
యాదాద్రి భువనగిరి జిల్లాలో పవిత్ర క్షేత్రమైన యదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని, భక్తిభావంతో నిండిన గిరిప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా పాల్గొని భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు.
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్న హరీష్ రావు
ఆలయం చుట్టూ 3 కి.మీ. పరిధిలో భక్తులతో కలిసి ప్రదక్షిణం చేస్తూ దైవిక ఆనందంతో గడిపిన హరీష్ రావు
గిరిప్రదక్షిణ పూర్తి చేసి కొండపైకి చేరుకున్న హరీష్ రావును ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
అర్చకులు అభిషేకం నిర్వహిస్తుండగా హరీష్ రావు భక్తితో దర్శించుకున్నారు.
దర్శనం తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన హరీష్ రావు, స్వామి వారికి మొక్కులు చెల్లించుకుని ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా హరీష్ రావును పలువురు భక్తులు కలిసి ఫోటోలు దిగారు
దర్శనం అర్చకులు హరీష్ రావుకు స్వామి వారి తీర్థం, ప్రసాదాలు అందజేస్తూ, ఆశీస్సులు తెలిపారు.
Updated Date - Sep 25 , 2025 | 03:02 PM