Ande Sri Final Rites: ప్రభుత్వ లాంఛనాలతో కవి అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన ముఖ్యమంత్రి రేవంత్..
ABN, Publish Date - Nov 11 , 2025 | 04:00 PM
మంగళవారం ఉదయం అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు అంతిమయాత్ర సాగింది. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
మంగళవారం కవి అందెశ్రీ అంత్యక్రియలు జరిగాయి. ఉదయం అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభమైంది. లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు అంతిమయాత్ర సాగింది.
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు జరిగాయి.
అందెశ్రీ అంత్యక్రియల సందర్భంగా నృత్యం చేస్తున్న కళాకారులు.
అందెశ్రీ గౌరవార్థం ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించిన అభిమానులు.
అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలి వచ్చారు.
అందె శ్రీ అంత్యక్రియల్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వి. హనుమంతరావు పాల్గొన్నారు.
అందెశ్రీ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు.
గంగిరెద్దుతో ప్రదర్శన చేస్తున్న కళాకారులు.
అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసిన సందర్భంగా గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన కవి, రచయిత అందెశ్రీ పాడె మోస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
Updated Date - Nov 11 , 2025 | 04:01 PM