మేడారం జాతరకు పొటెత్తిన భక్తులు
ABN, Publish Date - Dec 26 , 2025 | 09:33 PM
మేడారం జాతరకు ముందుగానే భక్తులు భారీగా తరలివస్తున్నారు. సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా వస్తున్నారు. ముందుగా జంపన్న వాగు స్నాన ఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పిస్తున్నారు.
మేడారం జాతరకు ముందుగానే భక్తులు భారీగా తరలివస్తున్నారు.
సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా వస్తున్నారు.
సమ్మక్క, సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి వేలాదిగా వస్తున్నారు.
తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమలు, పూలు, పండ్లు, ఎత్తు బంగారం, కానుకలు సమర్పిస్తున్నారు.
80 ఏళ్ల క్రితం దేవతా వృక్షంతో సాధారణ మట్టి గద్దెలతో ఉన్న తల్లుల దేవస్థానం.. 1969లో రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ ‘ఒడి’లోకి చేరింది.
ఆ మరుసటి ఏడాది 1970లో తొలిసారి రాష్ట్ర పండుగగా ‘మహా జాతర’ నిర్వహించినప్పటి నుంచి మేడారం సమ్మక్క- సారలమ్మల దేవస్థానం, దాని పరిసరాలు కొత్త సొబగులు సంతరించుకుంటూనే ఉన్నాయి.
గతంలో తాత్కాలికంగా క్యూలైన్లు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, రోడ్లు ఏర్పాటు చేసి 4 రోజుల జాతర జరిపేవారు.
మేడారం జాతరకు వచ్చిన యువతులు.
మేడారం జాతరలో కానుకలతో పాల్గొన్న మహిళలు.
మేడారం వన దేవతల దర్శనానికొచ్చే భక్తులు అడవి ప్రాంతాలు, వసతి గృహాలు, విడిది స్థలాల్లో సమ్మక్క-సారలమ్మలను ప్రకృతి దైవాలుగా భావించి చెట్లకు పూజలు చేస్తుంటారు.
Updated Date - Dec 26 , 2025 | 09:33 PM